Mysuru Palace: దసరా వేడుకలు షురూ! రాజభవనంలో గజరాజుల సందడి

కర్ణాటక సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా వేడుకలు-2026 అత్యంత కోలాహలంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల్లో అత్యంత కీలకమైన, అందరినీ ఆకట్టుకునే 'గజరాజుల దళం' చారిత్రాత్మక మైసూర్ రాజభవనంలోకి అడుగుపెట్టడంతో పండుగ శోభ ఉరిమేసింది. శుక్రవారం ఉదయం రాజభవనంలోని ప్రసిద్ధ జయమార్తాండ ద్వారం గుండా గజరాజులు లోపలికి ప్రవేశించగా, అక్కడ రాజభవన మండలి తరఫున కళాకారుల వాయిద్యాలు, జానపద నృత్యాలు, సాంప్రదాయ మంగళవాయిద్యాల నడుమ అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.

ఈ వేడుకల్లో భాగంగా కర్ణాటక అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే గజరాజులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వాటిపై పూల వర్షం కురిపించి సాదరంగా ఆహ్వానించారు. ఏటా నిర్వహించే దసరా ఉత్సవాల్లో దసరా ఏనుగుల రాక ఒక ముఖ్యాంశం. ముఖ్యంగా విజయదశమి రోజున సాగే ప్రతిష్టాత్మక 'జంబో సవారీ' ఊరేగింపులో ఈ ఏనుగులే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పండుగ పూర్తయ్యే వరకు మైసూర్ రాజభవన పరిసరాల్లోనే బస చేసే ఈ ఏనుగులకు ఆహారం, ఆరోగ్యం, శిక్షణ విషయంలో అటవీశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

Mysuru Dasara 2026 Begins With Grand Traditional Welcome for Elephant Squad at Historic Palace
Ranabaali: దసరా బరిలో విజయ్ - రష్మిక జంట - బిగ్ అప్‌డేట్..!!
Ranabaali: దసరా బరిలో విజయ్ - రష్మిక జంట - బిగ్ అప్‌డేట్..!!

నేతల సమక్షంలో వైభవంగా ప్రారంభం

మైసూర్ రాజభవనం వద్ద జరిగిన ఈ కంటికి పండుగలాంటి కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య, ఎమ్మెల్యేలు జీటీ దేవేగౌడ, హరీష్ గౌడ, ఎమ్మెల్సీ శ్రీవత్సతో పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, అటవీశాఖ ఉన్నతాధికారులు రవిశంకర్, ప్రభుగౌడ తదితరులు పాల్గొని గజరాజులకు నమస్కరించి వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ వేడుకతో మైసూర్ నగరం అంతటా దసరా పండుగ ఉత్సాహం నలుమూలలా వ్యాపించింది.

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మహర్ధశ. దసరా నాటికి మోదీ చేతుల మీదుగా..
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు మహర్ధశ. దసరా నాటికి మోదీ చేతుల మీదుగా..

దేశ విదేశాల పర్యాటకులకు మైసూర్ ఆహ్వానం

ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే మైసూర్ దసరా ఉత్సవాలు కేవలం కర్ణాటకకే కాకుండా దేశవిదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది పర్యాటకులకు ఒక గొప్ప విందులాంటివి. రాజభవనం విద్యుత్ కాంతుల వెలుగులు, సాంస్కృతిక కార్యక్రమాలు, గజరాజుల ఊరేగింపు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఏనుగుల దళం రాజభవనానికి చేరుకోవడంతో 2026 దసరా వేడుకల సన్నాహాలు వేగవంతమయ్యాయి. పర్యాటకులకు, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మైసూర్ జిల్లా యంత్రాంగం, అటవీశాఖ భారీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+