భారీ వర్షం: అండమాన్‌లో చిక్కుకున్న 800మంది పర్యాటకులు
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అండమాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాగా, ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆయా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లిన దాదాపు 800 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు.
పోర్ట్‌బ్లెయిర్: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అండమాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాగా, ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆయా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లిన దాదాపు 800 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు.
స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి మేరకు వారిని రక్షించేందుకు భారత నావికాదళం రంగంలోకి దిగింది. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నావికా దళానికి చెందిన నాలుగు ఓడలను అండమాన్‌కు పంపించారు.

ఐఎన్‌ఎస్ బిత్రా, బంగారం, కుంభీర్, ఎల్‌సీయూ-38 ఓడలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సహాయచర్యలపై నావికాదళ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications