ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో, తెలంగాణలో డబుల్: ఫలితాలపై ప్రధాని మోడీ స్పందన
న్యూఢిల్లీ: దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ప్రధాని నరేంద్రమోడీ. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం దేశ ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే మంత్రం గెలిచిందని వ్యాఖ్యానించారు.
మన దేశంలో ఎన్నికల ప్రక్రియను చూసి ప్రజలంతా గర్వపడుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఈ ఎన్నికల వల్లే మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని అన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించి ఎన్నికల సంఘం గర్వపడేలా చేసిందని అభినందించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు చెప్పుకొచ్చారు.

1962 తర్వాత మూడోసారి ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాలేదు అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో ఎన్డీయేకు ప్రజలు పట్టం కట్టారని చెప్పారు. ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో గొప్ప గెలుపు సాధించామన్నారు. తెలంగాణలోనూ బీజేపీకి ఉన్న సీట్లు డబుల్ అయ్యాయని ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కేరళలో కూడా తొలిసారి ఒక సీటు గెలుచుకున్నామని ప్రధాని మోడీ వెల్లడించారు.
అంతేగాక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, ఢిల్లీలో దాదాపు క్లీన్ స్వీప్ చేశామని ప్రధాని మోడీ చెప్పారు. దేశంలోని కోట్లాది మంది మహిళలు తమను ఆశీర్వదించారన్నారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నామన్నారు. తాము రాకముందు ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని చెప్పారు. 2014కి ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవన్నారు. తమ సేవలు చూసి ప్రజలు మూడోసారి పట్టం కట్టారని ప్రధాని మోడీ చెప్పారు.
#WATCH | Prime Minister Narendra Modi says, " ...On this sacred day, it is confirmed that NDA is forming govt for the 3rd time. We are grateful to the people..." pic.twitter.com/foNvYKs8E0
— ANI (@ANI) June 4, 2024
12 కోట్ల మందికి సురక్షిత నీరు అందించామన్నారు ప్రధాని మోడీ. నాలుగు కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించామని తెలిపారు. దేశ హితం కోసం నిత్యం ఆలోచిస్తామని.. ఆ దిశగా అడుగులు వేస్తామన్నారు. తాము చేపట్టిన పనుల వల్ల దేశం ప్రగతిపథంలో పయనిస్తోందని తెలిపారు. మీ ఆశీర్వాదమే నిరంతరం పని పనిచేసేందుకు తనకు ప్రేరణ అని మోడీ చెప్పారు. తాజా లోక్‌సభ ఫలితాలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించాయన్నారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు












Click it and Unblock the Notifications