రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, ఎన్ఐఏ పంజాతో షాక్, బీజేపీ కార్యకర్తతో లింక్ ఏమిటి ?
బెంగుళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించిన పోలీసులు తరువాత కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగిన తరువాత కేసు దర్యాప్తు అనేక మలుపులు తిరిగింది. రామేశ్వరం కేఫ్ నిందితుల ఊహా చిత్రాలు విడుదల చేసి వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
మరోవైపు నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి నగదు రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. ఇప్పుడు ఈ కేసులో కర్ణాటకలోని తీర్థహళ్లికి చెందిన బీజేపీ కార్యకర్తను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం తీర్థహళ్లిలో సాయిప్రసాద్ అనే బీజేపీ కార్యకర్తను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ ను ఎన్ఐఏ అధికారులు రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారని సమాచారం. గతవారం తీర్థహళ్లిలోని ఇద్దరు ముస్లిం యువకుల ఇల్లు, మొబైల్ షాపుపై ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహించారు. తరువాత ఆ ఇద్దరు ముస్లీం యువకులను విచారణ చేసిన ఎన్ఐఏ అధికారులు కీలక సమాచారం సేకరించారని తెలిసింది. బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ ఆ ఇద్దరు ముస్లిం యువకులతో నిత్యం టచ్ లో ఉన్నాడని తేలింది.
దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితం తీర్థహళ్లిలోని పలు ఇళ్లు, దుకాణాలపై ఎన్‌ఐఏ సైలెంట్ గా దాడులు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తీర్థహళ్లిలో బీజేపీ కార్యకర్త సాయి ప్రసాద్ ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. మరింత సమాచారం కోసం వేచి ఉండాలని సంబంధిత అధికారులు అంటున్నారు. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు రోజురోజుకు మలుపులు తిరుగుతోంది.

ముఖ్యంగా ఎన్‌ఐఏ సైలెంట్‌గా విచారణ ప్రారంభించి నిందితుల ఆచూకీ కోసం పని చేస్తోంది. రామేశ్వరం కేఫ్ కేసులో నిందితులు అందరిని అరెస్ట్ చేయడమే ఎన్ఐఏ లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసుకు సంబంధించి సెంట్రల్ జైలులో ఉన్న బళ్లారి వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేసిన ఎన్ఐఏ అధికారులు అతన్ని విచారణ చేసి వివరాలు సేకరించారు.












Click it and Unblock the Notifications