రాజస్థాన్ హత్యోదంతంలో ఎన్ఐఏ ఎంట్రీ: ఉగ్రవాద కోణంలో: వారికి ప్రమోషన్

జైపూర్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇద్దరు ముస్లింల చేతుల్లో అతను దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డు మీద తల నరికారు నిందితులు. ఈ ఘటన తరువాత రాజస్థాన్‌ అట్టుడికింది. ఈ హత్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఆందోళనకు దిగారు. రోడ్డు మీద టైర్లను తగులబెట్టారు. వాహనాల రాకపోకలను స్థానికులు అడ్డుకున్నారు. బంద్ పాటించారు.

ఈ ఘటనలో కొన్ని కొత్త కోణాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోన్నాయి. తనను హత్య చేయడానికి ఇద్దరు వ్యక్తులు రెక్కీ పన్నారంటూ కన్హయ్యలాల్ మూడు రోజుల కిందటే చెప్పారని కుటుంబ సభ్యులు చెప్పారు. మూడు రోజులుగా టైలరింగ్ షాప్‌ను తెరవనివ్వకుండా ఆ ఇద్దరూ బెదిరింపులకు దిగారని అన్నారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పటికీ- కుదరలేదని, మరిన్ని ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

NIA registers a case in incident of murder of Kanhaiya Lal Teli in Udaipur, Rajasthan

అక్కడి పరిస్థితులకు భయపడి వారం రోజులుగా షాప్‌కు వెళ్లకుండా ఇంట్లోనే గడిపారని అతని భార్య యశోద అన్నారు. మంగళవారం షాప్‌కు వెళ్లిన కన్హయ్య లాల్‌ను నిందితులు దారుణంగా హత్య చేశారని చెప్పారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ మాజీ నాయకురాలు నుపుర్ శర్మకు అనుకూలంగా కామెంట్స్ చేశారనే కారణంతో గౌస్ మహ్మద్, రియాజ్ అఖ్తారీ అనే ఇద్దరు కన్హయ్యలాల్‌ను హత్య చేసిన విషయం తెలిసిందే.

ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య చేసిన కొన్ని గంటల్లోనే వారిని పోలీసులు గుర్తించారు. కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసుల చర్యపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హర్షం వ్యక్తం చేశారు. తేజ్‌పాల్, నరేంద్ర, షౌకత్, వికాస్, గౌతమ్‌లకు పదోన్నతి కల్పించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కాగా- ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసింది. ఉగ్రవాద చర్య అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టింది.

ఈ మధ్యాహ్నం ఎన్ఐఏ అధికారులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరిపారు. వారి వద్ద నుంచి ఈ హత్యోదంతానికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు చోటు చేసుకున్న దర్యాప్తు వివరాలతో కూడిన ఫైల్స్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాగా- ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ ఘటన పట్ల మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఢిల్లీ జామా మసీద్ షాహీ ఇమాం సయ్యద్ ఇమాం బుఖారీ ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+