500 ఏళ్ల తర్వాత పంచ మహా పురుష రాజయోగాలు.. ఈ రాశులను ఎవరూ ఆపలేరు
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. శతాబ్దాల కాలంలో ఎప్పుడో కానీ జరగని ఒక అద్భుత గ్రహాల కూర్పు ఇప్పుడు సంభవించనుంది. దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత అంతరిక్షంలో ఒకేసారి "పంచ మహాపురుష రాజయోగాలు" ఏర్పడుతున్నాయి. గ్రహాల గమనం మార్చబోతున్న ఈ మహా యోగం వల్ల కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోనున్నాయి.
ఇకపై వారి విజయాలను ఆపడం ఎవరి తరమూ కాదని, వారి ఇంట ధన వర్షం కురవడం ఖాయమని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఐదు ప్రధాన గ్రహాల ప్రత్యేక స్థానాల వల్ల ఏర్పడే మహా యోగాలనే 'పంచ మహాపురుష రాజయోగాలు' అంటారు. ప్రస్తుతం ఈ ఐదు గ్రహాలూ అనుకూల స్థానాల్లోకి రావడం వల్ల ఈ అరుదైన అదృష్టం పడుతోంది.

రుచక యోగం కుజ గ్రహం వల్ల ఏర్పడుతుంది. భద్ర యోగం బుధ గ్రహ ప్రభావంతో సిద్ధిస్తుంది. హంస యోగం గురు దేవుని అనుగ్రహంతో లభిస్తుంది. మాలవ్య యోగం శుక్రుడి సంచారం వల్ల వస్తుంది. శశ యోగం శని దేవుని ఆశీస్సులతో కలుగుతుంది. 3 రాశులవారికి వీటివల్ల అద్భుతంగా ఉండబోతోంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి అన్ని రంగాల్లోనూ ఉచ్ఛస్థితి కనిపిస్తోంది. గతంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. పాత ఆర్థిక ఇబ్బందులన్నీ తొలిగిపోయి, బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. కొత్తగా వచ్చే ఆదాయ మార్గాల ద్వారా మీరు కాలంగా అనుకుంటున్న కలలు, కోరికలు నెరవేరుతాయి. వృత్తిపరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయం ఒక సువర్ణ అధ్యాయం లాంటిది. అడగకుండానే ఆకస్మిక ధన లాభాలు వరించే ఛాన్స్ ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రమోషన్లతో పాటు కొత్త బాధ్యతలు దక్కుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు ఊహించని లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి.
తులా రాశి
తులా రాశి వారి జీవితంలోకి లక్ష్మీదేవి నడిచి రాబోతోంది. నిలిచిపోయిన డబ్బు చేతికి అందడమే కాకుండా, ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభించే బలమైన సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో బంపర్ లాభాలు చూస్తారు. కొత్త వాహనం కొనడానికి లేదా విలువైన ఆస్తి ఒప్పందాలు చేసుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం.












Click it and Unblock the Notifications