ఒకే ఫ్లైట్‌లో ఉప్పు- నిప్పు
Nitish Kumar, Tejashwi Yadav: దేశంలో రాజకీయ పరిణామలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ప్రత్యేకించి- కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది చర్చనీయాంశమౌతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏకు బొటాబొటి మెజారిటీ సీట్లు లభించడం, ఓట్ల లెక్కింపు తరువాత కూటమిలో లుకలుకలు ఏర్పడటం శరవేగంగా సాగిపోయాయి.
ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎన్డీఏ సంకీర్ణ కూటమికి 292 సీట్లు లభించాయి. 400లకు పైగా సీట్లను సాధిస్తామంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ధీమాగా చెప్పిన బీజేపీ నాయకులు.. ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడిన ఫలితాలతో డీలా పడ్డారు. బీజేపీకి అత్యంత బలమైన ఉత్తరప్రదేశ్‌లో సైతం ఉమ్మడి ప్రతిపక్షాల కూటమి ఇండియా హవా వీచింది.

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి 234 స్థానాలు లభించాయి. ఇతరులు 17 చోట్ల గెలిచారు. అయినప్పటికీ- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను ప్రస్తుతానికి అందుకోలేకపోయిందీ ఇండియా అలయెన్స్. అదే సమయంలో ఎన్డీఏకు ఈ అవకాశం లభించింది.
ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు గాలం వేశారు ఇండియా కూటమి నాయకులు. ఆయనను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తమకు మద్దతు ఇస్తే కీలక పదవి ఇస్తామంటూ హామీలను ఇస్తోన్నారు.
ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం ఇండియా కూటమి నాయకులు సమావేశం కానున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ భేటీ జరుగనుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, డీ రాజా, సీతారాం ఏచూరి, చంపై సోరెన్, ఫరూక్ అబ్దుల్లా.. వంటి నాయకులు దీనికి హాజరు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ రెండు సమావేశాల్లో పాల్గొనడానికి ఎన్డీఏ, ఇండియా భాగస్వామ్య పక్షాలు జనతాదళ్ (యునైటెడ్) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి సూర్య.. పాట్నా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
వారిద్దరూ ఒకే ఫ్లైట్‌లో వెళ్లడం కనిపించింది. ముందు సీట్‌లో నితీష్ కుమార్, ఆయన వెనక సీట్‌లో తేజస్వి యాదవ్ కూర్చున్నారు. తొలుత తేజస్వి యాదవ్, ఆ తరువాత కొద్దిసేపటికి నితీష్ కుమార్ బోర్డింగ్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కొద్దిరోజుల కిందటి వరకూ వీరిద్దరూ కలిసి బిహార్‌లో ప్రభుత్వాన్ని నడిపించిన విషయం తెలిసిందే. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా, ఆయన డిప్యూటీగా తేజస్వి యాదవ్ పని చేశారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏతో కలిశారు. ఇప్పుడు ఆయన కోసం ఇండియా కూటమి ప్రయత్నాలు సాగిస్తోంది.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications