నార్త్ కారిడార్ బుల్లెట్ రైల్ కు ప్రధాని మోదీ ఆమోదం

ఉత్తరాదిన ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నార్తర్న్ కారిడార్ బులెట్ రైలు ప్రాజెక్ట్ ను వేగవంతం చేస్తోంది. దేశంలో రైల్ కనెక్టివిటీ మరింత మెరుగుపడేలా రూపొందించిన ఈ ప్రతిపాదనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదం సైతం తెలిపారు. దేశ రాజధానితో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్ లోని పలు ప్రధాన నగరాలను బుల్లెట్ రైల్ తో అనుసంధానించడమే ఈ కారిడార్ ముఖ్య ఉద్దేశం.

ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బుల్లెట్ రైల్ ట్రాక్ నిర్మాణ పనులను ఆయన ఈ మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఎఎన్ఐతో మాట్లాడారు. ఈ హైస్పీడ్ బులెట్ రైలు అందుబాటులోకి వస్తే వివిధ నగరాల మధ్య ప్రయాణం గణనీయంగా తగ్గుతుందని అన్నారు. ఢిల్లీ- ఆగ్రా మధ్య ప్రయాణ సమయం 59, ఢిల్లీ- కాన్పూర్ 1:45, ఢిల్లీ- లక్నో 2: 12 నిమిషాల్లో చేరుకోవచ్చని అశ్విని వైష్ణవ్ వివరించారు. గంటలో వారణాసి నుంచి పాట్నాకు వెళ్లొచ్చని చెప్పారు.

Northern Corridor Bullet Train Gets PM Modi Approval Says Ashwini Vaishnaw Set to Deliver Remarkable

ఢిల్లీ నుంచి వారణాసికి 3:33 నిమిషాల్లో ప్రయాణించవచ్చని అశ్విని వైష్ణవ్ చెప్పారు. వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు 33 నిమిషాలు, ఆగ్రాకు 2:34 నిమిషాల సమయం పడుతుందని అన్నారు. ఈ బుల్లెట్ రైలు వల్ల పారిశ్రామిక రంగానికి ఎంతగానో ఊతమిచ్చినట్టవుతుందని మంత్రి పేర్కొన్నారు. చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, యువత ఎక్కువగా లబ్ధి పొందుతారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. అత్యవసర వైద్య సేవల కోసం పెద్ద నగరాలకు వెళ్లాలనుకునే వారికీ ఇది ఉపశమనాన్ని ఇస్తుందని వ్యాఖ్యానించారు.

వైభవ్ సూర్యవంశీని ఇంటికి పంపండి
వైభవ్ సూర్యవంశీని ఇంటికి పంపండి

వివిధ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు పెరిగి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ బలోపేతమౌతుందని అశ్విని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. నార్త్ కారిడార్ ప్రాజెక్టును క్రమంగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి మీదుగా గౌహతి వరకు పొడిగించేందుకు సన్నాహాలు చేస్తోన్నామని, దీనికి అనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయనున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ కారిడార్‌కు సంబంధించి డిజైనింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని వివరించారు.

టాప్ న్యూస్ ప్రజెంటర్ ను పెళ్లాడిన సీఎం ఒమర్ అబ్దుల్లా
టాప్ న్యూస్ ప్రజెంటర్ ను పెళ్లాడిన సీఎం ఒమర్ అబ్దుల్లా

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న దేశ మొట్టమొది బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ముంబై-అహ్మదాబాద్ కారిడార్ కు సంబంధించిన పనులు వచ్చే ఏడాది పూర్తవుతాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అదే ఏడాది ఆగస్టు నాటికి మొదటి బుల్లెట్ రైలు పట్టాలెక్కేలా చర్యలు తీసుకుంటోన్నామని అన్నారు. ఈ హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు దేశ రైల్వే వ్యవస్థ రూపురేఖలను మార్చడమే కాకుండా, దేశంలో మౌలిక వసతుల కల్పనకు సరికొత్త దిశను నిర్దేశిస్తాయని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+