సూపర్ ఏటీఎంలు వస్తున్నాయ్: ఇక బ్యాంకులకు వెళ్లక్కర్లేదు!
న్యూఢిల్లీ: ఏటీఎం తయారీదారుదారు, సేవలందించే ఎన్‌సీఆర్ కార్పొరేషన్ వినియోగదారులకు మరిన్ని సేవలందించే మల్టీ ఛానల్ ఏటీఎంలను రూపొందించింది. బ్యాంకుకు వెళ్లకుండానే ఈ ఏటీఎం మెషీన్ ద్వారా ఏటీఎం కార్డును కూడా పొందవచ్చు.
ఈ ఏటీఎం మెషీన్ భవిష్యత్‌లో బ్యాంకుగా కూడా సేవలందించే అవకాశాలున్నాయి. అయితే, ఈ ఏటీఎంల ఖరీదు రూ. 30-50లక్షల వరకు ఉంటుంది. అంతేగాక, మెషీన్ అందించే సేవలను బట్టి దాని ధరలో తేడాలుంటాయి.
SS32,SS22, SS83 అనే మూడు రకాల ఏటీఎం మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి సాధారణ ఏటీఎంలానే పనిచేస్తాయి కానీ, వీటిలో అదనపు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మెషీన్లలో బ్యాంక్ అకౌంట్ తెరవడంతోపాటు చెక్కును క్లియర్ చేసుకునే అవకాశం ఉండటం విశేషం.

ఇన్‌స్టాంట్ బ్యాంక్ అకౌంట్స్, డెబిట్ కార్డ్స్, ఆటోమేటిక్ సిగ్నేచర్ వేరిఫికేషన్, నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, మొబైల్ టాపప్స్ చేసుకోవడం లాంటి సేవలం వీటిలో అందుబాటులో ఉండనున్నాయి. దీంతో వినియోగదారులకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా దాదాపు తగ్గిపోనుంది.
త్వరలోనే పబ్లిక్, ప్రైవేట్ బ్యాంకు రంగాలు సాధారణ ఏటీఎంల స్థానంలో ఈ మల్టీ ఛానల్ ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నాయి. ఎన్‌సీఆర్ కార్పోరేషన్ ఈ ఏటీఎంలను విస్తారంగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లను ఇప్పటికే చేసింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications