మూడోసారి: అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలసోర్: ఒడిశా తీరంలో గురువారం ఉదయం అగ్ని-3 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే ఈ క్షిపణి 3,000 కి.మీ పరిధిలోని లక్ష్యాలను చేధించగలదు. బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాంచ్ కాంప్లెక్స్-4 నుంచి క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డిఆర్‌డిఓ) అధికారులు తెలిపారు.
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని డిఆర్‌డిఓ మూడోసారి విజయవంతంగా ప్రయోగించింది. నేలపై నుంచి నేలపై లక్ష్యాలను ఛేదించే అగ్ని-3 బాలిస్టిక్ క్షిపణి 1.5 టన్నుల వార్‌హెడ్‌ను మోసుకుపోగలదు.

ఈ పరీక్ష భారత ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ నిర్వహించినట్లు ఐటిఆర్ డైరెక్టర్ తెలిపారు. 2006 సంవత్సరంలో మొదటిసారి అగ్ని-3ని పరీక్షించినప్పటికీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే 2012 సెప్టెంబర్ 21న మొదటిసారి పరీక్ష విజయవంతమైంది.
ఆ తర్వాత 2013 డిసెంబర్ 23న రెండోసారి, గురువారం మూడోసారి విజయవంతంగా ప్రయోగించారు. వాతావరణంతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ క్షిపణిని ప్రయోగించాడానికి అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications