Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బయటపడ్డ 'థార్' స్కామ్'..? అటవీశాఖపై చర్యలకు ఆదేశాలు..!

ఒడిశా రాష్ట్రంలో 'థార్ స్కామ్' వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. రూ. 7 కోట్లు పెట్టి 51 మహీంద్రా థార్ వాహనాలను కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఆ వాహనాలను మోడిఫికేషన్ చేసేందుకు మరో రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో వెల్లడించింది. ఈ క్రమంలో కేవలం వాహనాలకు చేసిన ఖర్చే రూ. 12 కోట్లకు చేరుకోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒడిశా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని విమ‌ర్శ‌లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్ర ప్ర‌భుత్వం స్పెష‌ల్ బృందంతో ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది.

ఒడిశా రాష్ట్రానికి చెందిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ దాదాపు రూ. 7 కోట్లు ఖర్చు చేసి 51 మ‌హేంద్ర థార్ వాహ‌నాల‌ను కొనుగోలు చేసింది. అయితే ఆ వాహ‌నాల‌ను మోడిఫై చేసేందుకు అద‌నంగా మ‌రో రూ. 5 కోట్లు ఖర్చుచేసింది. అయితే వీటి కొనుగోలుపై సర్వత్రా విమ‌ర్శ‌లు రావ‌డంతో ఒడిశా ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ కొనుగోలు చేసిన వాహ‌నాల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు మహీంద్రా థార్ వాహనాల కొనుగోలు, మాడిఫికేషన్ కు అయిన ఖర్చులపై ఆడిట్‌ నిర్వహించాలని పర్యావరణ శాఖ మంత్రి గణేష్ రామ్ సింగ్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఒడిశాలోని అటవీ ప్రాంతాల్లో వన్యమృగాలను మానిటరింగ్ చేసేందుకు, అటవీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేసేందుకు, వేటను నిషేధించడం కోసం గతేడాది రూ. 7కోట్లతో 51 థార్ వాహనాలను కొనుగోలు చేశారు. అంటే ఒక్కో వాహనం కోసం రూ. 14 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మాడిఫికేషన్ కోసం ఒక్కో వాహనం మీద మరో రూ. 9 లక్షలు వెచ్చించారు.

Odisha Forest Dept s 12 Crore Thar Splurge 7 Cr Purchase 5 Cr Mods Trigger Special Audit

మాడిఫికేషన్ లో భాగంగా థార్ వాహనాలకు అదనపు లైట్లు, కెమెరాలు, సైరన్లు, ప్రత్యేక టైర్లు, ఇతర పరికరాలను అమర్చారు. అయితే థార్ వాహనాల్లో మార్పులు అవసరమా..? అన్న కోణంలో ప్రస్తుతం అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆడిటింగ్ సమయంలో ఏదైనా చట్టవిరుద్ధమైన, అనుమానాస్పద కార్యకలాపాలు బయటపడితే అందుకు కారకులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+