రూ.5.4 కోట్లు చెల్లించు: ఆఫీస్ బాయ్‌కి ఐటీ నోటీసులు
ఓ ఆఫీస్ బాయ్‌కి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. రూ5.4 కోట్ల ట్యాక్స్ పెండింగులో ఉందని అందులో పేర్కొనడం గమనార్హం.
ముంబై: నోట్ల రద్దు అనంతరం ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కూలీవాడు, ఆటో డ్రైవర్ అకౌంట్లలో కోట్లాది రూపాయలు జమ అయిన సందర్భాలు చూశాం. తాజాగా, ఓ ఆఫీస్ బాయ్‌కి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. రూ5.4 కోట్ల ట్యాక్స్ పెండింగులో ఉందని అందులో పేర్కొనడం గమనార్హం.
రూ.5.4 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఆదాయపన్ను శాఖ నుంచి వచ్చిన నోటీసులు చూసి మురికివాడలో నివసించే యువకుడు షాకయ్యాడు. ఐటీ పంపిన నోటీసుల ప్రకారం అతడు నాలుగు కంపెనీలకు యజమాని. అతను మహారాష్ట్రకు చెందిన గణేష్ దేవీ నగర్‌కు చెందిన రవి.

ఐటీ నోటీసులు పంపించడంతో అతను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తన వద్ద అంత డబ్బు లేదని, తనకు అన్ని కంపెనీలు లేవని థానే ఎస్పీకి చెప్పాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన పోలీసులు... రవి పాన్ కార్డు, ఆధార్ కార్డులను ఉపయోగించుకుని కొందరు నాలుగు బోగస్ కంపెనీలను తెరిచినట్టు గుర్తించారు.
తాను 2008లో రాజేశ్ అగర్వాల్ అనే చార్టెడ్ అకౌంటంట్‌కి చెందిన కంపెనీలో చేరాననీ, జీతం కోసం బ్యాంకు ఖాతా తెరవాలంటూ తన ఆధార్, పాన్ కార్డులను తీసుకున్నారని రవి పోలీసులకు తెలిపారు. అయితే బ్యాంకు ద్వారా తనకు జీతమివ్వలేదనీ చేతికి ఇచ్చేవారని చెప్పాడు.
2012లో అక్కడ ఉద్యోగం మానేసి వేరే కంపెనీలో చేరినట్లు తెలిపాడు. దర్యాప్తు అనంతరం పోలీసులు అగర్వాల్‌తో పాటు అతని వ్యాపార భాగస్వామి రాజీవ్ గుప్తా, అగర్వాల్ ఉద్యోగులు జుగులేశ్ గుప్తా, సంతోష్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. అక్రమార్జన కోసం వీరు జైశ్వాల్ పేరిట నాలుగు బోగస్ కంపెనీలు సృష్టించారు.












Click it and Unblock the Notifications