బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Ola,uber Auto: అందరికీ న్యాయం జరగాలి, హైకోర్టు, చార్జీ ఫిక్స్ చెయ్యండి !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో ఉబర్, ఓలా, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు. కర్ణాటక రవాణా శాఖ ఆదేశాల మేరకు ఆ సంస్థల సర్వీసులు నిలిచిపోయాయి. ఓలా, ఉబర్ కంపెనీల ప్రతినిధులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. వాదనలు విన్న హైకోర్టు అందరికి న్యాయం జరిగేలా చర్చలు జరపాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ఆటోలు ట్యాక్సీ కిందకు రావని, ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు మొబైల్ యాప్ తో ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారని, ఇది కర్ణాటక రవాణ శాఖ నియమాలకు విరుద్దంగా ఉన్నాయని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు.

Kerala: నరబలి ముందు సినీ ప్రముఖులతో డాక్టర్ దంపతులు భేటీ, లైలా స్టేట్ మెంట్ లో ?, షఫీ తోపు !Kerala: నరబలి ముందు సినీ ప్రముఖులతో డాక్టర్ దంపతులు భేటీ, లైలా స్టేట్ మెంట్ లో ?, షఫీ తోపు !

 ప్రభుత్వం చెప్పింది ఎంత ?, చార్జీ వసూలు చేస్తోంది ఎంత ?

ప్రభుత్వం చెప్పింది ఎంత ?, చార్జీ వసూలు చేస్తోంది ఎంత ?

బెంగళూరుతో సహ కర్ణాటకలో ఆటో డ్రైవర్లు రెండు కిలోమీటర్ల వరకు మినిమమ్ చార్జ్ రూ. 30 వసూలు చెయ్యాల్సి ఉంది. ఈ నియమనిబంధనలు కర్ణాటక ప్రభుత్వ రవాణా శాఖ అధికారులు నిర్ణయించారు. అయితే ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ లు ఉన్న ఆటో డ్రైవర్లు భారీగా మినిమమ్ చార్జీ ప్రయాణికుల నుంచి వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడం, రవాణా శాఖ అధికారులు ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మొదలైయ్యింది.

 దెబ్బకు సర్వీసులు బంద్

దెబ్బకు సర్వీసులు బంద్

బెంగళూరులో ఉబర్, ఓలా, ర్యాపిడో క్యాబ్ లు, ఆటో సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు. కర్ణాటక రవాణా శాఖ ఆదేశాల మేరకు ఆ సంస్థల సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఉబర్, ర్యాపిడో, ఓలా సర్వీసులు నడిపితే చట్టపరంగా చర్చలు తీసుకుంటామని కర్ణాటక రవాణా శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు.

 హైకోర్టుకు వెళ్లిన సంస్థలు

హైకోర్టుకు వెళ్లిన సంస్థలు

కర్ణాటక రవాణా శాఖ దెబ్బతో ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థల ప్రతినిధులు బిత్తరపోయారు. ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ, ఉబర్ ఇండియా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వేర్వేరుగా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ఎంజిఎస్. కమల్ పిటిషన్ విచారణ చేశారు

 చర్చలు జరపండి.... మీరే చార్జీ రేట్ ఫిక్స్ చెయ్యండి

చర్చలు జరపండి.... మీరే చార్జీ రేట్ ఫిక్స్ చెయ్యండి

వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి అందరికి న్యాయం జరిగేలా చర్చలు జరపాలని, ప్రభుత్వం మినిమమ్ చార్జ్ ధరను నిర్ణయించాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించారు. ఆటోలు ట్యాక్సీ సర్వీసుల కిందకు రావని, ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు మొబైల్ యాప్ తో ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారని, ఇది కర్ణాటక రవాణ శాఖ నియమాలకు విరుద్దంగా ఉన్నాయని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ప్రభులింగ కర్ణాటక హైకోర్టుకు చెప్పారు.

 ఏదో ఒకటి చెయ్యాలని ?

ఏదో ఒకటి చెయ్యాలని ?

ఇప్పటికే రెండుసార్లు చర్చలు విఫలం కావడంతో ఇప్పుడు మరోసారి ఉబర్, ఓలా, ర్యాపీడో సంస్థలతో చర్చలు జరిపి ఓ ధర నిర్ణయించాలని కర్ణాటక రవాణా శాఖ అధికారులు సిద్దం అవుతున్నారని తెలిసింది. మొత్తం మీద ఇంతకాలం సామాన్య ప్రజల నుంచి మొబైల్ యాప్ పేరుతో భారీ మొత్తంలో చార్జీలు వసూలు చేస్తున్న సంస్థలకు కళ్లెం వెయ్యాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది.

English summary
Ola, uber Auto issue: Karnataka High Court asks Karnataka Government to fix rate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X