లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లా

ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాదాపు అన్ని పార్టీలు ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. లోక్‌సభ సమావేశాల మూడో రోజున బుధవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఎన్నిక జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ఓం బిర్లా పేరును ప్రతిపాదించగా.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, వైసీపీ నేత మిథున్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులు ఓం బిర్లాను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఓం బిర్లా స్పీకర్ ఛైర్‌లో కూర్చునే సమయంలో సభ భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తింది.

ఎన్నిక ఏకగ్రీవం గర్వకారణం

ఎన్నిక ఏకగ్రీవం గర్వకారణం

స్పీకర్ ఎన్నిక అనంతరం సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీ ఎన్నిక ఏకగ్రీవం కావడం గర్వకారణమని అన్నారు. ప్రజాప్రతినిధిగా రాజస్థాన్‌లో ఓం బిర్లా చేసిన సేవలు చాలా మంది ఎంపీలకు తెలుసని అన్నారు. మినీ ఇండియాగా పేరున్న రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓం బిర్లా.. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టి సమాజసేవలో నిమగ్నమయ్యారని మోడీ ప్రశంసించారు.

విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి

విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి

ఓం బిర్లా 1962 నవంబర్ 23న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించారు. అజ్మీర్‌లోని మహర్షి దయానంద్ సరస్వతి యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో మాస్టర్స్ చేశారు. బీజేపీకి సంప్రదాయ ఓటు బ్యాంకైన మార్వారి బనియా సామాజిక వర్గానికి చెందిన ఆయన ఏబీవీపీ నాయకుడిగా ఉండగానే తన తెలివితేటలు, సృజనాత్మకతతో బీజేపీ పెద్దల దృష్టిలో పడ్డారు. బీజేవైఎంలో వివిధ పదవులు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. 1987-91 మధ్యకాలంలో కోటా బీజేవైఎం అధ్యక్షుడిగా.. 1991-97లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1997-2003లో బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఎమ్మెల్యేగా హ్యాట్రిక్

ఎమ్మెల్యేగా హ్యాట్రిక్

2003లో తొలిసారి కోటా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓం బిర్లా కోటా బుందీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి 2.79లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రధాని మోడీ, అమిత్ షాకు అత్యంత సన్నిహితుడైన బిర్లా సవాళ్లను స్వీకరించడంలో ఎప్పుడు ముందుంటారు. ఆ కారణంగానే ఆయనకు లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+