కేంద్రమంత్రి స్మృతి చదువు వివాదం, ఒమర్ మద్దతు
న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ వివాదంలో చిక్కుకున్నారు. తన తాజా అఫిడవిట్లో ఆమె డిగ్రీ పూర్తి చేయలేదని ఉంది. దీనిపై కాంగ్రెసు పార్టీ భగ్గుమంది. స్మృతికి మానవ వనరుల శాఖను ఇవ్వడంపై విమర్శలు గుప్పించింది.
12వ తరగతి చదివిన వ్యక్తికి మానవ వనరుల శాఖ బాధ్యతలా? అని ఏఐసిసి నేత అజయ్ మాకెన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏం కేబినెట్ మోడీది.. మానవ వనరుల శాఖా మంత్రి కనీసం డిగ్రీ కూడా చదివలేదంటూ ట్వీట్ చేశారు. మానవవనరుల శాఖ బాధ్యతలు అనుభవం ఉన్నవారికి అప్పగించాల్సిందని ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్ అభిప్రాయపడ్డారు.

బిజెపి దీనిపై ఎదురుదాడికి దిగింది. సోనియా విద్యార్హత ఏంటో చెప్పాలని జౌళీ శాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తీరు దురదృష్టకరమని రవిశంకర ప్రసాద్ అన్నారు. కాంగ్రెసు తన విమర్శల పైన ఆత్మపరిశీలన చేసుకోవాలని ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ముందు సోనియా అర్హత ఏమిటో చెప్పాలని కేంద్రమంత్రి ఉమాభారతి ప్రశ్నించారు. తమ నేతల వ్యాఖ్యల పైన సోనియా జాగ్రత్త వహించాలన్నారు.
కాగా, స్మృతి ఇరానీ విద్యార్హత వివాదంపై జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఆమెకు ఆయన మద్దతుగా మాట్లాడారు. పౌర విమానయానం చేపట్టాలంటే పైలట్ కోర్స్ చేయనవసరం లేదు కదా, బొగ్గు శాఖను నిర్వహంచాలంటే గనుల్లో తవ్వాల్సిన అవసరం లేదు కదా అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications