వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు గంటల్లోనే పిఎఫ్ విత్ డ్రాయల్, రోజుల తరబడి నిరీక్షణకు చెక్

ఉద్యోగుల పిఎఫ్ విత్ డ్రాయల్ ప్రక్రియ ఇక నుండి గంటల వ్యవధిలోనే ముగియనుంది. క్లైయిమ్స్ సెటిల్ మెంట్ కోసం ఆన్ లైన్ ప్రక్రియను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వరలోనే లాంచ్ చేయనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఉద్యోగుల పిఎఫ్ విత్ డ్రాయల్ ప్రక్రియ ఇక నుండి గంటల వ్యవధిలోనే ముగియనుంది. క్లైయిమ్స్ సెటిల్ మెంట్ కోసం ఆన్ లైన్ ప్రక్రియను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వరలోనే లాంచ్ చేయనుంది.

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈఫిఎఫ్ విత్ డ్రాయల్ పెన్షన్ స్థీరీకరణ వంటి అన్ని సదుపాయాలను కల్పించనుంది.

పిఎఫ్ క్లైయిమ్ ల కోసం ప్రస్తుతం కనీసం నెలరోజులకు పైగా వ్యవధి తీసుకొంటుంది.ఈ తరుణంలో ఉద్యోగులకు సత్వరమే ఫిఎఫ్ ఖాతాల క్లైయిమ్ లను సెటిల్ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది.

ఫిఎఫ్ ఖాతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే ఫిఎఫ్ ఖాతాలకు సంబందించిన సెటిల్ మెంట్లను త్వరితగతిన చేపట్టేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది.

ఆన్ లైన్ ద్వారా పిఎఫ్ విత్ డ్రాయల్

ఆన్ లైన్ ద్వారా పిఎఫ్ విత్ డ్రాయల్

ఆన్ లైన్ సౌకర్యం ద్వారా ఫిఎఫ్ ను విత్ డ్రాయల్ చేసుకోనే వెసులుబాటును కేంద్రం కల్పించనుంది. ఈ మేరకు అన్ని చర్యలను తీసుకొంటుంది.పేపర్ వర్క్ కుస్వస్తి పలికి ఆన్ లైన్ లో పిఎఫ్ ను విత్ డ్రాయల్ చేసేందుకు గాను ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ పద్దతి అమల్లోకి వస్తే గంటల వ్యవధిలోనే పిఎఫ్ ఖాతాల్లోని డబ్బు ఉద్యోగులకు చేరే అవకాశం ఉంది.

కోటి ధరఖాస్తులు పెండింగ్ లో

కోటి ధరఖాస్తులు పెండింగ్ లో

ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాల నుండి డబ్బులను విత్ డ్రాయల్ చేసుకొనేందుకు పెద్ద ఎత్తున ధరఖాస్తు చేసుకొంటున్నారు. అయితే ఇప్పటివరకు సుమారు కోటి ధరఖాస్తులు ఈపిఎఫ్ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఖాతాలను క్లియర్ చేసేందుకుగాను ప్రభుత్వం ఆన్ లైన్ పద్దతిలోనే ఉద్యోగుల క్లైయిమ్ లను పరిష్కరించాలని నిర్ణయం తీసుకొంది.

మే చివరి వరకు ధరఖాస్తులన్నీ ఆన్ లైన్ లోనే

మే చివరి వరకు ధరఖాస్తులన్నీ ఆన్ లైన్ లోనే

ప్రస్తుతం సెంట్రల్ సర్వర్ తో దేశంలోని అన్ని కార్యాలయాలను అనుసంధానించే పని కొనసాగుతోంది. ఈ ఏడాది మే చివరి నాటికి ఈ పని పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే అన్ని ధరఖాస్తులను , క్లైయిమ్ లను ఆన్ లైన్ లోనే నమోదు చేసుకోనేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది. ఈ మేరకు ఈపిఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్ వీసీ జాయ్ తెలిపారు.ధరఖాస్తు చేసిన కొన్ని గంటల్లోనే క్లైయిమ్ లను సెటిల్ చేయనున్నారు.

మూడు గంటల్లోనే క్లైయిమ్ ల విత్ డ్రాయల్

మూడు గంటల్లోనే క్లైయిమ్ ల విత్ డ్రాయల్

ఆన్ లైన్ ఉద్యోగుల పిఎఫ్ క్లైయిమ్ ల కొరకు ధరఖాస్తు చేసుకొంటే వాటిని మూడు గంటల్లోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ అంతా 20 నుండి నెల రోజుల వ్యవధి పడుతోంది. అయితే దీన్ని మూడు గంటల్లోనే క్లైయిమ్ చేసుకోనేలా మార్చడం వల్ల ఉద్యోగులకు ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు.

ఆధార్ తప్పనిసరి

ఆధార్ తప్పనిసరి

ఆన్ లైన్ పద్దతిలో ధరఖాస్తు చేసుకోవడంతో పాటు పిఎఫ్ ను విత్ డ్రాయల్ చేసుకొనేందుకుగాను ఆధార్ నెంబర్ ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం.చందాదారులంతా తప్పనిసరిగా ఈపీఎఫ్ ఓ వద్ద తమ ఆధార్ నెంబర్ ను సమర్పించాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పారు.ఆన్ లైన్ సౌకర్యం వల్ల ఖాతాదారులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

English summary
The Employees' Provident Fund Organisation or EPFO is expected to launch an online facility for settlement of claims, including EPF withdrawal and pension fixation, by May this year to put an end to tedious paperwork by its members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X