‘ఆపరేషన్ సింధూర్ 2.0’ రెడీ! త్రివిధ దళాల సరికొత్త యుద్ధ వ్యూహం లీక్!

భారత సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం అత్యంత కీలకమైన, వ్యూహాత్మక ప్రకటన చేశారు. సాయుధ బలగాలు 'ఆపరేషన్ సింధూర్ 2.0'కు సంపూర్ణంగా సన్నద్ధమై ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సరిహద్దుల్లో శత్రుత్వాలు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ, లోపల మాత్రం భారత సైన్యం అత్యంత చురుగ్గా భవిష్యత్ సవాళ్లకు సన్నద్ధమవుతోందని భద్రతా బలగాల పరాక్రమాన్ని చాటిచెప్పారు. పుణెలోని ప్రతిష్ఠాత్మక 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ' (NDA) 150వ కోర్సు పాసింగ్-అవుట్ పరేడ్ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి మొదటగా ఒక విషయం గుర్తుంచుకోవాలి.. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి శత్రుత్వాలు తాత్కాలికంగా మాత్రమే నిలిచిపోయాయి. ఒకవేళ 'ఆపరేషన్ సింధూర్ 2.0' అంటూ జరిగితే, అందుకు భారత సైన్యంతో పాటు త్రివిధ దళాలు అత్యంత పటిష్టంగా, అద్భుతంగా సిద్ధపడుతున్నాయి" అని జనరల్ ద్వివేది సైన్యం యొక్క యుద్ధ సన్నద్ధతను తేల్చి చెప్పారు. కేవలం సాంప్రదాయ సరిహద్దులకే పరిమితం కాకుండా.. భూమి, గగనతలం, సముద్రం, అంతరిక్షం (Space), సైబర్, కాగ్నిటివ్ (Cognitive) వంటి బహుళ రంగాల్లోని సరికొత్త ఆధునిక యుద్ధ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని, అంతర్గత శక్తిని నిరంతరం బలోపేతం చేసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.

Operation Sindoor 2 0 Indian Armed Forces Fully Prepared for Multi-Domain Modern Warfare Says Army Chief
ఆపరేషన్ సింధూర్: ఇక ఊచకోతే, రాజ్‌నాథ్ వార్నింగ్
ఆపరేషన్ సింధూర్: ఇక ఊచకోతే, రాజ్‌నాథ్ వార్నింగ్

24/7 పారదర్శక యుద్ధభూమి.. ప్రతి కదలికపైనా నిఘా!

భవిష్యత్తులో రాబోయే యుద్ధాలు మునుపటిలా ఉండబోవని, ఆధునిక సాంకేతికత వల్ల యుద్ధభూమి పూర్తిగా మారిపోయిందని ఆర్మీ చీఫ్ విశ్లేషించారు. "మనం కొంతకాలంగా గమనిస్తున్నదేమిటంటే.. అధునాతన సాంకేతికతలు, నిరంతర నిఘా కారణంగా నేటి యుద్ధభూమి 24 గంటలూ అత్యంత పారదర్శకంగా మారింది. మనం వేసే ప్రతి అడుగు, ప్రతి కదలిక అవతలి పక్షానికి (శత్రువుకు) క్షణాల్లో తెలిసిపోతుంది" అని ఆయన నొక్కిచెప్పారు. ఈ మారుతున్న పరిస్థితుల రీత్యా, వ్యూహాత్మకంగా మన బలగాల మోహరింపు విషయంలో, అలాగే సరిహద్దు ప్రాంతాల్లోని మన సైనికులను, పౌరులను రక్షించడానికి అవసరమైన రక్షణ చర్యల విషయంలో మన రక్షణ వ్యవస్థ అత్యంత జాగ్రత్తగా, పటిష్టమైన వ్యూహాలతో ముందుకు సాగుతోందని హెచ్చరించారు.

Video: పాక్ గడ్డపై భారత ప్రళయం! ప్రధాని పవర్‌ఫుల్ మెసేజ్
Video: పాక్ గడ్డపై భారత ప్రళయం! ప్రధాని పవర్‌ఫుల్ మెసేజ్

త్రివిధ దళాల ఐక్యతే దేశానికి శ్రీరామరక్ష!

ఆధునిక బహుళ-రంగ కార్యకలాపాల (Multi-domain operations) సవాళ్లను సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ మధ్య ఉండాల్సిన అపారమైన సమన్వయం దేశ భద్రతకు అత్యంత అత్యవసరమని జనరల్ ద్వివేది పునరుద్ఘాటించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా శత్రువుల వ్యూహాలను చిత్తు చేయడానికి భారత సాయుధ బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇచ్చిన ఈ హై-ఎలివేషన్ స్టేట్‌మెంట్ ఇప్పుడు దేశ రక్షణ రంగంలో సరికొత్త జోష్ నింపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+