ఆపరేషన్ సింధూర్.. మోదీ చర్యకు మద్దతుగా ఉప్పొంగిన భారతం; దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు!

పాకిస్తాన్లోనూ, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోను ఉగ్రవాద వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని భారత సాయుధ దళాలు నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ సైనిక చర్య జరిపిన విషయం తెలిసిందే. మన దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నిన ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపారు. మొత్తం 9 ప్రదేశాలు లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

సరిహద్దుల్లో పాక్ కాల్పులకు దీటుగా భారత్ సమాధానం
పాకిస్తాన్ పై భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింథూర్ గురించి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడారు. ఆపరేషన్‌ వివరాలను, తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సింథూర్ మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతోంది.

Operation Sindoor India is overjoyed in support of Modi govt action Cheers spread across the country

Take a Poll

భారత్ దీటైన జవాబు ఇచ్చిందన్న విదేశీ వ్యవహారాల మంత్రి
పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్లోను పాకిస్తాన్లోనూ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింథూర్ నుప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రాత్రంతా పర్యవేక్షించారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో వైమానిక దాడుల గురించి ప్రస్తావిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జై శంకర్ పాకిస్తాన్ కు భారత్ దీటైన జవాబు ఇచ్చిందని ఉగ్రవాదం పట్ల ప్రపంచం ఇకపైన ఎటువంటి సహనం చూపడానికి వీలులేదని అన్నారు.

ప్రధాని మోదీ నిర్ణయం పట్ల యావత్ దేశం హర్షం
ఇక ఆపరేషన్ సింధూర్ పైన యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తుంది. గతంలో సర్జికల్ స్త్రైక్స్ తో ఏ విధంగా అయితే భారత్ సత్తా చాటిందో, అదే తరహాలో నిన్న రాత్రి ఉగ్ర స్థావరాలను కూల్చివేసిన ఆపరేషన్ సింధూర్ తో భారత్ సాహసోపేత చర్యను అందరూ కొనియాడుతున్నారు. సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం ఇదని, దీనిద్వారా ప్రపంచానికి కూడా భారత్ సత్తా తెలిసిందని అంటున్నారు.

ఉగ్రవాదంపై ఉక్కుపాదంతో ప్రపంచానికే దిక్సూచిగా భారత్
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని ప్రజల నుండి, ప్రముఖుల నుండి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదంపై భారత్ ఉక్కుపాదం మోపిందని అంటున్నారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాదాన్ని అణచివేయటంపై భారత్ తీసుకున్న సైనిక చర్య ద్వారా దిశా నిర్దేశం చేసిందని ప్రజలనుండి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దేశాన్ని విచ్చిన్నం చేయాలన్న ఉగ్రవాదులను మట్టు బెట్టడం ద్వారా, ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడుతుందన్న భావన ఈ చర్య ద్వారా వ్యక్తమవుతుంది.

పహల్గామ్ మృతుల కుటుంబాలకు ఊరట కలిగిందని అభిప్రాయం
భారత్ శాంతిని స్థాపించడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటుందని, ప్రాథమికంగా మన దేశం శాంతియుత దేశమని కానీ దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేసే వారికి ఇలాంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రధాని మోదీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశంలో పహల్గామ్ మృతుల కుటుంబాలకు న్యాయం జరిగిందని కూడా దేశం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+