అసెంబ్లీకి సీఎం తాగొచ్చారు - అసెంబ్లీలో సంచలనం..!!
పంజాబ్ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి ప్రవర్తన దుమారానికి కారణమైంది. ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. సభ ప్రారంభం కాగానే.. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సభలో పెను దుమారం రేగింది. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ఇదే సమయంలో భగవంత్ మాన్ ప్రసంగించే సమయంలో మద్యం మత్తులో తూగుతున్నట్లు ఒక వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పంజాబ్ అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మే డే వేళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఆ సమయంలో సీఎం భగవంత్ మాన్ వ్యక్తిగత ప్రవర్తన పైన ప్రతిపక్ష కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రి మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. అందరికీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేసారు. సీఎం భగవంత్ ప్రవర్తన శాసనసభ గౌరవాన్ని దిగజార్చింది. సభలో అనుచితం గా ప్రవర్తించినందుకు గానూ ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రికి పరీక్షలు చేయించాలని.. స్పీకర్ స్పందించనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఇదే అంశం పై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి మద్యం మత్తులో అసెంబ్లీకి వస్తే తామేం చేయాలని.. ఆయనే మత్తులో ఉన్నప్పుడు సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

విరుచుకుడిన ప్రతిపక్షం
రాష్ట్రాన్ని నడిపే వ్యక్తి ఇలాంటి పరిస్థితిలో ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. సభలో ఉన్న అందరికీ పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే వ్యవహారం పై శిరోమణి అకాలీ దల్ తీవ్రంగా స్పందించింది. పంజాబ్ ప్రజల ముందు నిజం బయటపడేందుకు సీఎంకు వెంటనే డోప్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ కూడా భగవంత్ మాన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం భగవంత్ తరచూ మద్యం సేవించే ప్రభుత్వ కార్యక్రమాలు, బహిరంగ, అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారని ఆరోపించారు. పంజాబ్ వంటి సున్నితమైన సరిహద్దు రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి ఎప్పుడూ మద్యం మత్తులో ఉండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. మద్యం మత్తులోనే ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కాగా, ఈ వివాదంపై కాంగ్రెస్ శాసనసభా పక్షం స్పీకర్‌కు లేఖ రాసింది. సీఎం భగవంత్ మాన్‌తో పాటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరికి డోప్ టెస్టులు నిర్వహించాలని కోరింది. సీఎం మాత్రం ఈ వాదనలను ఖండించారు.













Click it and Unblock the Notifications