ట్విట్టర్ మాజీ చీఫ్‌ను బెదిరించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాది రైతులు సాగించిన పోరాటం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అప్పట్లో. సుమారు ఏడాది పాటు రైతులు రోడ్లపైనే కాలం గడుపారు. చలి, ఎండ, వానను లెక్కచేయలేదు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వెనకడగు వేసేంత వరకూ వారి ఉద్యమం కొనసాగింది. ప్రతిపక్ష పార్టీలన్నీ రైతు ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి.
రైతులు రోడ్డెక్కిన సమయంలో వారి ఉద్యమం, ఆందోళనలకు సంబంధించిన ఏ ఒక్క సమాచారం కూడా బయటికి రాకుండా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్త పడినట్లు ఇప్పుడు వార్తలొస్తోన్నాయి. రైతు ఆందోళన సమాచారం టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై పబ్లిష్ కాకుండా కేంద్రం చర్యలు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలు నిజం దాల్చినట్టే కనిపిస్తోంది.

ఆ సమాచారాన్ని అడ్డుకోవాలంటూ భారత ప్రభుత్వం నుంచి అప్పట్లో తీవ్ర ఒత్తిళ్లు వచ్చినట్లు ట్విట్టర్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాక్ డోర్సీ వెల్లడించారు. బ్రేకింగ్ పాయింట్ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు. ట్విటర్‌తో పాటు రైతుల నిరసనలు, ప్రభుత్వాన్ని విమర్శించే అకౌంట్లను బ్లాక్ చేయాలంటూ భారత్ నుంచి విజ్ఞప్తులు, ఒత్తిళ్లు వచ్చాయని జాక్ డోర్సీ చెప్పారు.
ఆ అకౌంట్లన్నింటినీ వెంటనే బ్లాక్ చేయకపోతే తమ దేశంలో ట్విట్టర్ కార్యాలయాన్నింటినీ మూసివేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తామంటూ బెదిరింపులు అందినట్లు జాక్ డోర్సీ వెల్లడించారు. భారత్‌తో పాటు టర్కీ నుంచి కూడా బెదిరింపులను ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. టర్కీ ప్రభుత్వం కూడా ట్విట్టర్‌ను మూసివేస్తామని బెదిరించిందని, దీనిపై కోర్టుకు వెళ్లి విజయం సాధించామని వివరించారు.
జాక్ డోర్సీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆయన అబద్ధం చెప్పాడని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. జాక్ డోర్సీ ఆధీనంలో ఉన్నప్పుడు ట్విట్టర్ దేశ చట్టాలను పదేపదే ఉల్లంఘించిందని, చట్టవిరుద్ధంగా కార్యకలాపాలను నిర్వహించిందని ఉన్నారు. 2020 నుంచి 2022 వరకు ట్విట్టర్- యథేచ్ఛగా చట్టాల ఉల్లంఘనకు పాల్పడిందని వివరించారు.
2022 జూన్ తరువాతే దేశ చట్టాలకు లోబడి పని చేశారని, వాటికి కట్టుబడి ఉన్నారని రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. భారత్‌లో ఏ ట్విట్టర్ ఉద్యోగి కూడా జైలుకు వెళ్లలేదని, వారి కార్యకలాపాలు స్తంభించలేదని గుర్తు చేశారు. ఐటీ చట్టాలను అమలు చేయడంలో తాము వెనకాడే ప్రసక్తే లేదని, భారత్‌ను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగించే సంస్థలు వీటికి లోబడే ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications