శబరిమలకు వస్తున్న భక్తులకు దేవస్థానం బోర్డు బిగ్ అప్డేట్, 18 మెట్లు ఎక్కే వేళ..!!
శబరిమల సన్నిధానంకు భక్తులు పోటెత్తుతున్నారు. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దేవ స్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే హై కోర్టు ఆదేశాల మేరకు స్పాట్ బుకింగ్ ను పరిమితం చేసిన దేవస్థానం.. భక్తుల రద్దీ వేళ భద్రతా పరమైన చర్యలు ప్రారంభించారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్ నిపుణుల కమిటీని ఏర్పాటు కు నిర్ణయించింది. 18 మెట్లు ఎక్కే భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. వేళ అదే విధంగా శబరిమలకు ఈ రద్దీ సమయంలో వస్తున్న భక్తులకు ఆలయ పాలకవర్గం కీలక సూచనలు చేసింది.
శబరిమలలో భక్తులు పోటెత్తుతున్నారు. మండలం, మకరవిలక్కు వార్షిక ఉత్సవాల నేపథ్యంలో భక్తులు తరలివస్తున్నారు. తొలివారంలోనే ఏకంగా 5.75లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. తాజాగా శనివారం సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 72వేల మందికిపైగా శబరిమలకు చేరినట్లుగా అధికారులు చెప్పారు. భక్తుల తాకిడి కొనసాగుతుందని.. అయితే, అడపాదడపా వర్షాలు కురుస్తున్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా శబరిమల యాత్ర కొనసాగుతుందని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్న ట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తుల కోసం క్యూ షెల్టర్ల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన అవ సరం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

పంపలో నిర్వహించిన ఈ సమావేశంలో రద్దీకి అనుగుణంగా స్పాట్ బుకింగ్‌ను రద్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఎక్కువ మంఇ భక్తులకు దర్శనాలు కల్పించేందుకు వీలుగా 18 మెట్లను ఎక్కే భక్తుల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రస్తుతం నిమిషానికి 75 మంది మెట్లను ఎక్కుతుండగా.. ఈ సంఖ్యను 85కి పెంచాలని చెప్పారు. గత సంవత్సరం ఈ సీజన్‌లో 53.6 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను సందర్శించారు. ఈ సారి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అంచనా ప్రకారం.. నవంబర్ 16 నుంచి సీజన్ మొదలు కాగా.. దాదాపు ఇప్పటి వరకు 5లక్షల మందికిపైగా అయ్యప్పను దర్శించుకున్నారు. నీలక్కల్-పంప సేవల్లో కేరళ ఆర్టీసీకి రోజువారీ ఆదాయం రూ.60లక్షలు పెరిగింది. సన్నిధానంలో దర్శన సమయాలపై టీడీబీ సమగ్ర సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకోనుంది.
కాగా, ఎక్కువ మంది భక్తులకు దర్శనాలు కల్పించేందుకు వీలుగా 18 మెట్లను ఎక్కే భక్తుల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రస్తుతం నిమిషానికి 75 మంది మెట్లను ఎక్కుతుండగా.. ఈ సంఖ్యను 85కి పెంచాలని చెప్పారు. గత సంవత్సరం ఈ సీజన్‌లో 53.6 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను సందర్శించారు. ఈ సారి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుం దని భావిస్తున్నారు. అంచనా ప్రకారం.. నవంబర్ 16 నుంచి సీజన్ మొదలు కాగా.. దాదాపు ఇప్పటి వరకు 5లక్షల మందికిపైగా అయ్యప్పను దర్శించుకున్నారు. సన్నిధానం ఆరోగ్య కేంద్రంలో ఎకోకార్డియోగ్రామ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖకు సూచించారు. పంప, నీలక్కల్‌లలో పనిచేస్తున్న పోలీసు బృందాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని కూడా నొక్కి చెప్పింది. పంపా వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications