సిమ్లా ఒప్పందం రద్దు చేసిన పాక్.. సీన్‌లోకి చైనా ఎంట్రీ..?
ప్రస్తుతం ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి ఘటనలో 27 మంది అమాయక పర్యాటకుల రక్తం నేలపై చిందింది. ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన 28 మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరారు.ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన ఎవర్నీ కూడా వదిలిపెట్టబోమని, ఎక్కడ దాక్కున్న ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు. హల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
దేశంలో ఉన్న పాక్ పౌరులను స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో సింధు నదిలో ఇచ్చే వాటాలను సైతం నిలిపిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో పాక్ కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సిమ్లా ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపిస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. సిమ్లా ఒప్పందం నిలిపివేయడం వల్ల భారత్‌కు వచ్చే నష్టాలు, అసలు సిమ్లా ఒప్పందంలో ఏముందో తెలుసుకుందాం.

సిమ్లా ఒప్పందం అనేది 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒక శాంతి ఒప్పందం. ఈ ఒప్పందం 1972 జూలై 2న హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేశారు. ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రెండు దేశాల మధ్య సంబంధాలను సాధారణీకరించడం మరియు శాంతిని నెలకొల్పడం. ఒప్పందంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు:
ద్వైపాక్షిక చర్చలు: కాశ్మీర్ సమస్యతో సహా అన్ని సమస్యలను శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు దేశాలు అంగీకరించాయి. మూడవ దేశం లేదా అంతర్జాతీయ మధ్యవర్తిత్వం ఉండకూడదని నిర్ణయించారు.
నియంత్రణ రేఖ (LOC): 1971 యుద్ధం తర్వాత ఏర్పడిన కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖగా గుర్తించారు. ఈ రేఖను ఏకపక్షంగా మార్చకూడదని రెండు దేశాలు అంగీకరించాయి.
దళాల ఉపసంహరణ: అంతర్జాతీయ సరిహద్దుల నుండి తమ దళాలను ఉపసంహరించుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయి.
ఖైదీల విడుదల: యుద్ధ ఖైదీలను తిరిగి పంపించడానికి అంగీకారం కుదిరింది.
సాధారణ సంబంధాల పునరుద్ధరణ: సమాచార మార్పిడి, పోస్టల్ సేవలు, రవాణా మరియు వాణిజ్య సంబంధాలను క్రమంగా పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.సిమ్లా ఒప్పందం ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ఒక ముఖ్యమైన ప్రయత్నం. అయితే, కాశ్మీర్ సమస్యతో పాటు ఇతర వివాదాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వైపాక్షిక చర్చలకు ప్రాధాన్యతనిస్తుంది, అయితే అనేక సందర్భాల్లో ఇరు దేశాలు ఆ దిశగా స్థిరమైన పురోగతిని సాధించలేకపోయాయి.
ఇటీవల, 2025 ఏప్రిల్ 24న, పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో జరిగిన ఉగ్రదాడి మరియు అనంతరం భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత దిగజార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సిమ్లా ఒప్పందం తాత్కాలికంగా పాక్ నిలిపివేయడంతో సీన్‌లోకి చైనా వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అమెరికా చైనా విధించిన పన్నులతో కుదేలు అవుతుందని, ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా , పాక్ వివాదంలోకి చైనా రాకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications