భారత సైన్యంపై శివసేన నేత రౌత్ సంచలన వ్యాఖ్యలు
ముంబై: భారత సైన్యంపై, ఆయుధ సంపత్తిపై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం ఆదివారం రాత్రి మరోసారి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో లెఫ్టినెంట్ అధికారితో పాటు మరో ముగ్గురు జవాన్లు మరణించారు.
దానిపై శివసేన నేత రౌత్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పాకిస్తాన్ వద్ద ఆయుధాలున్నాయని, బారత్ వద్ద కూడా ఆయుధాలు ఉన్నాయని, పాకిస్తాన్ ఆ తుపాకులూ ఆయుధాలతో దాడులు చేసి భారత జవాన్లను చంపుతోందని ఆయన అన్నారు.

భారత్ మాత్రం తన ఆయుధ సంపత్తిని, క్షిపణులను కేవలం ప్రదర్శన కోసం ఉంచుతోందని, ప్రశంసలు పొందేందుకు రాజ్‌పథ్‌లో ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలకు విదేశాల నంచి వచ్చే అధినేతలకు, ప్రతినిధులకు భారత సైన్యం ఆయుధాలను ప్రదర్శించి ప్రశంసలు పొందడానికే కదా మన తుపాకులు, ఆయుధాలు అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ దురాగతాలకు పాల్పడుతున్న సందర్భాల్లో భారత ఆర్మీ సైతం అదే స్థాయిలో బుద్ధి చెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదని, యుద్ధం ప్రకటించిందని ఆనయన అన్నారు. అదే రీతీలో భారత్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
పాకిస్తాన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పకపోతే మనం ప్రపంచం దృష్టిలో అసమర్థులుగా మిగిలిపోతామని అన్నారు.












Click it and Unblock the Notifications