ఫిబ్రవరి 1 నే కేంద్ర బడ్జెట్.. తొలిసారి ఆదివారం నాడు

భారత పార్లమెంటరీ చరిత్రలో తొలిసారి ఒక విశేషం నమోదు కాబోతుంది. ఇప్పటికే 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్ధిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచిన క్రమంలో.. మరో అరుదైన రికార్డ్ కు ఆమె సిద్ధమయ్యారు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆమె 9వ సారి పద్దును ప్రవేశ పెట్టబోతున్నారు. అది కూడా ఆదివారం నాడు ఈ సారి బడ్జెట్ ఉభయ సభల ముందుకు రానుంది.

2026-27ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టబోతున్నారు. 2017 నుంచి ఈ సంప్రదాయం ప్రారంభమైంది. సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలో పెద్ద మార్పును 2017 లో చేశారు. అంతకు, సాధారణ బడ్జెట్ ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేవాళ్లు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి వచ్చే నిధులను అంచనా వేసి ఆయా రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టడానికి ఆలస్యమవుతుంది కేంద్రం భావించి తేదిని మార్చింది.

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదటి మూడు నెలల ఖర్చులకు ప్రభుత్వం అనుమతి పొందేది. అయితే, మొత్తం సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌కు తర్వాత ఆమోదం లభించేది. 2017 నుంచి నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని ప్రారంభించారు. దీంతో మార్చి చివరి నాటికి బడ్జెట్‌కు పార్లమెంట్ ఆమోదం పొందేది.

Parliament Budget Session to Start on January 31 Union Budget 2026-27 Set for Sunday

ఎలాంటి మార్పు లేదు..

ఈ సారి కూడా పార్లమెంట్ లో బడ్జెట్‌ ఫిబ్రవరి 1నే ఉభయ సభల ముందుకు రానుంది. బడ్జెట్‌ సమావేశాలకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదలైంది. పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCPA) సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకుంది. జనవరి 31న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభ కాబోతున్నాయి. అదే రోజు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. అనంతరం ఫిబ్రవరి 1న లోక్ సభ, రాజ్యసభల్లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 సంవత్సరానికి సంబంధించి వార్షిక పద్దును ప్రవేశపెడతారు.

దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఈ సారి తన తొమ్మిదో బడ్జెట్‌ను సమర్పించబోతున్నారు. ఇది దేశ చరిత్రలో ఓ కీలక మైలురాయి. అయితే ఆదివారం సెలవు దినం కావడంతో పాటు ఆ రోజున గురు రవిదాస్ జయంతి కూడా ఉండటంతో తేదీ మార్పుపై ఊహాగానాలు నెలకొన్నాయి. వాటిని ఖండిస్తూ.. అధికారిక ప్రకటన విడుదలైంది. భారత పార్లమెంటరీ చరిత్రలో బడ్జెట్‌ను గతంలో శనివారాల్లో ప్రవేశపెట్టిన సందర్భాలు ఉన్నాయి 2020లో, 2025లో శనివారం పద్దును ప్రవేశపెట్టారు. కానీ ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇప్పటి వరకు జరగలేదు. కాగా దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలమ్మ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+