డెడ్‌బాడీతో 600 కిలోమీటర్లు ప్రయాణం చేసిన ప్యాసెంజర్లు..
భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆచారాలు, వ్యవహారాలు, మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సెంటీమెంట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా చనిపోతే అప్పటివరకూ వారిపై ఉన్న విలువ, నమ్మకం అన్నీ పోయి.. సెంటీమెంట్లు గుర్తొస్తాయి. శవం ఉన్న ప్రాంతమంతా భయం వాతావరణం నెలకొంటుంది. అలాంటిది శవం పక్కనే ఉన్న కానీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో.. ప్రాణభీతితో బిక్కుబిక్కుమంటూ కొన్ని కిలోమీటర్ల మేర ప్రయాణం చేశారు ఓ రైలులోని ప్రయాణికులు. డెడ్‌బాడీతో పాటు వారంతా సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఓ శవంతో కలిసి కొందరు ప్రయాణికులు సుమారు ఆరువందల కిలోమీటర్ల బలవంతంగా, భయంతో ప్రయాణి చేయాల్సి వచ్చింది.
సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు : తమిళనాడులోని ఓ రైలులో వెలుగు చూసిన షాకింగ్ ఘటన ఇది. సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు జనరల్ కోచ్‌లలో ప్రయాణిస్తున్న వారిలో ఓ ప్రయాణికుడు చనిపోయాడు. అయితే ఈ విషయం తెలిసినా కానీ, ప్యాసెంజర్లు ఏమీ చేయలేని పరిస్థితిలో ఆ బాడీతో పాటు సుమారు 600 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఈ రైలు చెన్నై నుంచి హజ్రత్ నిజాముద్దీన్‌కు వెళ్లింది. ఈ విషయంపై ప్రయాణీకులు రైల్వే అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా, వారు మాత్రం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి చేరుకునే వరకు మృతదేహాన్ని తొలగించలేదు. ఝాన్సీకి చేరుకున్నతరువాత ప్రభుత్వ రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం పంపించారు.

రైలులో మృతిచెందిన రామ్‌జీత్ : ఆ రైలు ప్రయాణంలో మరణించిన వ్యక్తి పేరు రామ్‌జీత్ యాదవ్. ఈయన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాకు చెందినవాడు. ఈయనకు 36 యేళ్లు.. ఈ వ్యక్తి చెన్నైలో పనిచేసేవాడు. అతను అనారోగ్యం కారణంగా ఇక్కడకు వచ్చాడు. అయితే, తన బావ గోవర్ధన్‌తో కలిసి తిరిగి బందాకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయితే, ఆదివారం నాడు ఈ ట్రైన్ నాగ్‌పూర్‌కు చేరుకునేసరికి రామ్‌జీత్ ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతింది. అలా కొద్దిసేపటికే రామ్‌జీత్ మరణించాడు. ఈ విషయాన్ని గమనించిన బావ గోవర్థన్ రామ్‌జీత్‌ను కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ, అతని ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వలేదు.
దీంతో అదే బోగీలో ప్రయాణం చేసేవారు ఆ మృతదేహాంతో పాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. రాత్రంతా ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం చేరవేస్తూనే ఉన్నారు. అయినా కానీ అధికారులు స్పందించలేదు. అయితే, ఉదయం రైలు భోపాల్‌కు చేరుకోగానే ప్రయాణికులు మళ్లీ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అయినా ఉదయం కూడా అధికారులు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్టేషన్ ఝాన్సీ వద్దకు చేరుకున్న తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారు. ఏదఏమైనా రైలు ప్రయాణికులు మాత్రం రాత్రంతా ఓ డెడ్‌బాడీతో ప్రయాణం చేయాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications