అయోధ్య నిర్మించింది మోదీనా ? రామ మందిరం నిర్మించింది ఎవరో తెలుసా ? పేజావర స్వామీజీ !

హిందూ దేవాలయాలను హిందువులకు అప్పగించాలని పేజావర మఠం స్వామిజీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ అన్నారు. ఇతర మతాల ఆలయాలను ఆయా మతాలకు అప్పగించినట్లే హిందూ దేవాలయాలను కూడా హిందువులకు అప్పగించాలని, అప్పుడే హిందువులకు న్యాయం జరుగుతుందని పేజావర స్వామీజీ అన్నారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతిలో మీడియాతో మాట్లాడిన స్వామీజీ ప్రధాని మోదీకి ఈ ఇలా మనవి చేశారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వాలు పాటించాలని పేజావర స్వామీజీ అన్నారు. హిందూ మతం, బ్రాహ్మణులు అణచివేతకు గురవుతున్నారని, దానిని అరికట్టాలని ప్రధాని మోదీకి పేజావర స్వామీజీ మనవి చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించింది కేంద్ర ప్రభుత్వం కాదని. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దీనిని హిందూ ట్రస్ట్ నిర్మించిందని, అయోధ్య రామమందిరాన్ని కూల్చివేయడమంటే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని పేజావర స్వామీజీ అన్నారు.

Pejavara Swamiji said that the Ayodhya Ram temple was not built by the central government but by a Hindu trust

అయోధ్య రామమందిర నిర్మాణంపై బోధిసత్వ అంబేద్కర్ సేవా సమితి నిరసనలను వ్యక్తం చెయ్యడం వలనే అయోధ్య రామమందిరం నిర్మించారని , మందిరాన్ని మందిరంగా ఉంచేందుకు హిందూ ధర్మం ఉండాలని పేజావర స్వామీజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. జాతి, దేశం ప్రేమను కాపాడుకోవాలని, దేశంలోని అన్ని ప్రాంతాల్లో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కేంద్ర ప్రభుత్వానికి పేజావర స్వామీజీ సూచించారు.

హిందూ దేవాలయాలను హిందువులకు అప్పగించాలని, ఇతర మతాల దేవాలయాలను ఆయా మతాలకు ఇచ్చినట్లే హిందూ దేవాలయాలను కూడా హిందువులకు అప్పగించాలని పేజావర స్వామీజీ కేంద్ర ప్రభుత్వాన్ని, కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయోధ్య రామమందిరాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించలేదని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హిందూ ట్రస్టు నిర్మించిందని పేజావర మఠానికి చెందిన విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం మీద పేజావర స్వామీజీ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+