People's pulse exit polls: ఈశాన్యంలో సీన్ రివర్స్..!!

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ వివరాలిలా ఉన్నాయి.

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఈ నెల 16వ తేదీన త్రిపుర అసెంబ్లీకి పోలింగ్ ముగిసింది. ఇవ్వాళ.. మేఘాలయా, నాగాలాండ్ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ గడువు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలిలా ఉన్నాయి. మార్చి 2వ ఓట్ల లెక్కింపు ఉంటుంది.

త్రిపురలో హంగ్..

త్రిపురలో హంగ్..

త్రిపురలో అధికార భారతీయ జనతా పార్టీకి 18 నుంచి 26 సీట్లు వస్తాయని అంచనా వేసింది పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్. సీపీఎం, ఇతర లెఫ్ట్ పార్టీలకు 14 నుంచి 22, తిప్రా మోతా పార్టీకి 11 నుంచి 16 లభిస్తాని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఒకటి నుంచి మూడు స్థానాలకే పరిమితం కావొచ్చని తెలిపింది. ఐపీఎఫ్టీతో పాటు ఇతరులకు ఒకటి నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తేలింది.

మేజిక్ ఫిగర్..

మేజిక్ ఫిగర్..

60 స్థానాలు ఉన్న త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 సీట్లు అవసరమౌతాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. బీజేపీ- అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటులో తిప్రా మోతా పార్టీ కింగ్ మేకర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన తిప్రా మోతా పార్టీ ఎవరికి మద్దతు ప్రకటిస్తే- వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

మేఘాలయాలోనూ..

మేఘాలయాలోనూ..

మేఘాలయలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్పీపీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ సంస్థ అంచనా వేసింది. మేఘాలయలో ఎన్పీపీకి 17 నుంచి 26 సీట్లు లభిస్తాయని తెలిపింది. టీఎంసీకి 10 నుంచి 14, యూడీపీకి 8 నుంచి 12, బీజేపీకి 3 నుంచి 8, కాంగ్రెస్ కి 3 నుంచి 5, ఇతరులు 4 నుంచి 9 సీట్లు గెలిచే అవకాశం ఉంది.

 ఇక్కడా అంతే..

ఇక్కడా అంతే..

60 స్థానాలు ఉన్న మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల సంఖ్య 31. ఇక్కడా హంగ్ అసెంబ్లీ ఏర్పడొచ్చని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఎన్నికల ఫలితాల తర్వాత కుదిరే పొత్తులే మేఘాలయలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది నిర్ణయిస్తుందని అంచనా వేసింది ఎగ్జిట్ పోల్.

నాగాలాండ్ లో రెండోసారి..

నాగాలాండ్ లో రెండోసారి..

పీపుల్స్ పల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే- నాగాలాండ్ లో ఇప్పుడున్న పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీపీపీ పార్టీకి 20 నుంచి 27, బీజేపీకి 14 నుంచి 21, ఎల్జేపీకి 5 నుంచి 10 సీట్లు, ఎన్పీఎఫ్ కు 3 నుంచి 8, కాంగ్రెస్ కు 2 నుంచి 4, ఇతరులకు 2 నుంచి 4 సీట్లు వస్తాయి. 60 స్థానాలు ఉన్న నాగాలాండ్ లో అధికారాన్ని అందుకోవడానికి అవసరమైన సీట్ల సంఖ్య 31. ఎన్డీపీపీ, బీజేపీ కలిసి వరుసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+