Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టేకాఫ్ సమయంలోనే పరిస్థితి చేయి దాటింది- క్షణాల్లో భస్మీపటలం: పైలెట్ నుంచి చివరి సందేశం ఇదే

Air India flight Crash: అహ్మదాబాద్ లో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ విమానం కుప్పకూలింది. అది- ఎయిరిండియాకు చెందిన విమానంగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రమాదానికి గురైన సమయంలో ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది. ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న మెఘానీ నగర్, షాహిబాగ్ వద్ద కుప్పకూలింది.

Pilot of Crashed Air India flight gave a MAYDAY Call to ATC just before and no response thereafter

సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ-అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. విమాన శకలాలు జనావాసాల మీద పడటం వల్ల మరణాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి.

అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 ఫ్లైట్ అది. గట్విక్ ఎయిర్ పోర్టుకు చేరాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం 1:39 నిమిషాలకు టేకాఫ్ అయింది. రన్ వే నంబర్ 23ని వీడింది. ఆ కొద్ది సేపటికే కుప్పకూలింది. పెద్ద శబ్దం చేస్తూ.. నిప్పు కణికలా నేలకు రాలింది. ఆ వెంటనే దట్టమైన పొగ వెలువడింది. సంఘటన స్థలంలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది.

అగ్నిమాపక వాహనాలు, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోయింది. సమాయక చర్యలు అందజేయడానికి సంఘటన స్థలానికి స్థానికులు పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న వాహనాలను క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడాని వినియోగించారు.

ఈ ఘోర దుర్ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కు ఫోన్ కాల్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ఆదేశించారు.

ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటోన్న సమయంలోనే ప్రమాదాన్ని పసిగట్టారు పైలెట్లు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్క కంట్రోల్ కు సమాచారం ఇచ్చారు. MAYDAY కాల్ చేశారు. అత్యంత తీవ్ర ఆందోళనకర పరిస్థితుల్లో మాత్రమే పైలెట్లు ఈ కాల్ చేస్తుంటారు. I need help అంటూ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. అదే చివరిది.

ఆ తరువాత విమానంతో ఏటీసీకి సంబంధాలు తెగిపోయాయి. ఏటీసీ పదే పదే సమాచారాన్ని పంపించినప్పటికీ కాక్ పిట్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఆ వెంటనే భారీ శబ్దం రావడం, మంటలు చెలరేగడం, దట్టమైన పొగ వెలువడటంతో ఎయిర్ పోర్ట్ అధికారులను ఆందోళనకు గురి చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+