స్మృతి ఇరానీ కేసు: ఉద్దేశ్యపూర్వకంగానే కెమెరాల ఏర్పాటు
పనాజీ: గోవాలోని ఫ్యాబ్ ఇండియా గార్మెంట్స్ షోరూంలోని ట్రయల్ రూంలో ఉద్దేశపూర్వకంగానే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని గోవా పోలీసులు తెలిపారు. వారు ప్లాన్‌లో సూచించిన ప్రకారం కెమెరాలు ఏర్పాటు చేయలేదని స్పష్టం చేశారు.
ఫ్యాబ్ ఇండియా వస్త్రదుకాణానికి వెళ్లిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అక్కడ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరాల ఏర్పాటుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఫ్యాబ్ ఇండియా ఉద్యోగులు బెయిల్‌పై విడుదలయ్యారు.

వారిని పోలీసు కస్టడీకి ఎందుకు కోరలేదన్న విమర్శలపై పోలీసులు స్పందిస్తూ ఆ అవసరం రాలేదని చెప్పారు. ఆ కెమెరా గత కొద్ది నెలలుగా ఉన్నదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన బాధితులను కూడా పోలీసులు ప్రశ్నించనున్నారని సమాచారం.
ఈ కేసులో నిందితులను తప్పకుండా శిక్షిస్తామని ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు సునీల్ గార్గ్ చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో దాదాపు 45 షోరూంలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దుకాణంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు ఉంచిన స్థలాన్ని మార్చాలని అందులో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications