PM Kisan: భార్యా, భర్త ఇద్దరికీ పీఎం కిసాన్ డబ్బులు..! అవాక్కైన కేంద్రం..!
రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (pm-kisan) పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది లబ్ది పొందుతున్నారు. ఇప్పటికే 20 సార్లకు పైగా కేంద్రం ఈ నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. కేంద్రం ఇస్తున్న డబ్బులకు తమ వంతుగా కొంత డబ్బులు జమ చేసి ఏపీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్నాయి. దీంతో పీఎం కిసాన్ పథకానికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అయితే ఇందులోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కేంద్రం స్పందించింది.
పీఎం కిసాన్ నిధుల లబ్దిదారుల ఖాతాల్ని పరిశీలిస్తోంది. ఇందులో 31 లక్షల ఖాతాలపై కేంద్రం అనుమానాలు వ్యక్తం చేసింది. వీటిలో తాజాగా దాదాపు 19.02 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్ని చెక్ చేసింది. ఇందులో దాదాపు 93 శాతం ఇళ్లలో అంటే 17.87 లక్షల మంది భార్యా భర్తలైన లబ్దిదారులు ఇద్దరూ వేర్వేరుగా ఈ పథకం కింద వస్తున్న డబ్బుల్ని తీసుకుంటున్నట్లు తేలింది. దీంతో కేంద్రం షాక్ కాక తప్పలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పుడు రాష్ట్రాలకు లేఖలు పంపి, అక్టోబర్ 15 నాటికి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది.

పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం సంవత్సరానికి 6 వేల రూపాయలను మూడు దఫాలుగా 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భూమి రికార్డుల ప్రకారం సాగు భూమిని కలిగి ఉన్న "భర్త, భార్య , మైనర్ పిల్లల్ని ఓ కుటుంబంగా నిర్వరించాయి. అయితే ఇందులో ఎవరో ఒకరికి మాత్రమే ఈ పథకం ప్రయోజనం లభిస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కో కుటుంబంలో ఇద్దరు చొప్పున తీసుకుంటున్న కేసులు 1.76 లక్షలుగా తేలింది.

వీటితో పాటు గత భూ యజమానుల వివరాలు "చెల్లనివి లేదా ఖాళీ"గా గుర్తించబడిన 33.34 లక్షల అనుమానిత కేసులను కూడా కేంద్రం గుర్తించింది. ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి బదిలీతో నమోదైన రైతులకు, పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో గత భూ యజమాని వివరాలను అందించాలి. గత భూ యజమాని ఈ పథకం ప్రయోజనాలను పొందకూడదు. అయితే ఇద్దరూ ఈ పథకం ప్రయోజనం పొందుతున్న కేసులు 8.11 లక్షలుగా గుర్తించారు. అలాగే ఈ పథకంలో వారసత్వంగా మ్యుటేషన్ అనుమతించినా.. పరిశీలన సమయంలో 8.83 లక్షల కేసులు గుర్తించారు. వీటిలో వారసత్వంగా కాకుండా మ్యుటేషన్‌కు ఇతర కారణం నమోదు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications