ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. ప్లాన్- B ఇదేనా..? ఈ రాత్రి పాక్ కు చుక్కలే.. ?
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. దిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డిఫెన్స్ చీఫ్ అనిల్ చౌహాన్ తో పాటు త్రివిధ దళాల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్- పాకిస్థాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించిన కొద్ది సేపటికే పాకిస్థాన్ తన దొంగ బుద్ధిని ప్రదర్శించింది. కాశ్మీర్, నాగ్రోటా ప్రాంతాల్లో మళ్లీ దాడులకు పాల్పడింది. దీంతో ఈ విషయాన్ని ప్రధాని మోదీ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ భేటీ కీలకం కానుంది. పాకిస్థాన్ ను మరోసారి నిలువరించాలన్న దానిపై త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ చర్చిస్తున్నారు. పాకిస్థాన్ పై మరోసారి కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఈ సమావేశం సాగుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఎమర్జెన్సీ మీటింగ్ పై ఇప్పుడు యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నమ్మించి మోసం చేసిన పాకిస్థాన్ కు మరోసారి దీటుగా సమాధానం చెప్పాలని నెటిజెన్లు డిమాండ్ చేస్తున్నారు. యుద్ధాన్ని కొనసాగించాలని అంటున్నారు. దీంతో ప్రధాని మోదీ భేటీ కీలకం కానుంది.
#WATCH | Army Chief, Air Force Chief, Navy Chief, CDS, and NSA Doval arrive at PM Modi's residence for a crucial meeting.
— TIMES NOW (@TimesNow) May 11, 2025
Rajnath Singh also chaired the meeting with the CDS and Army Chief.@pragyakaushika, @deepduttajourno share more details with @prathibhatweets. pic.twitter.com/Gb5CdSTLTq
మరోవైపు మే 12 సోమవారం పాకిస్థాన్ ఆర్మీ అధికారులతో చర్చలు జరపనుంది భారత యంత్రాంగం. దీంతో ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసకోనున్నారు. సరిహద్దు భద్రత, సైనిక చర్య సన్నద్ధత.. తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ మాత్రం మరోసారి అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ అవసరమని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అభిప్రాయపడ్డారు.
అయితే నిన్న రాత్రి పాకిస్థాన్ దొంగ దెబ్బ తీసింది. కాల్పుల విరమణకు తల ఊపినట్లే ఊపి తోక జాడించింది. అర్థరాత్రి జమ్మూలో మోటార్ షెల్లింగ్, డ్రోన్ లతో వరుసగా నాలుగో రోజూ దాడులకు పాల్పడింది. పాక్ దాడుల్లో కశ్మీర్ ప్రభుత్వ అధికారి, ఇద్దరు భద్రతా అధికారులు సహా 7 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. నగ్రోటా వద్ద భారత్ లోకి చొరబడేందుకు పాకిస్థాన్ యత్నం చేసింది. అయితే చొరబాటుదారులపై భారత ఆర్మీ కాల్పులు జరిపింది.












Click it and Unblock the Notifications