RSS అంటే ఏంటో చెప్పిన మోడీ, గుజరాత్ అల్లర్లపై ఇలా
భారతదేశ హితం కోసం నిరంతరం పనిచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అమెరికాకు చెందిన ప్రముఖ యూట్యూబర్, ఏఐ సైంటిస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న భారత ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడు గంటల నిడివి కలిగిన ఈ సుదీర్ఘ పాడ్‌కాస్ట్ వీడియోను ఆదివారం ఫ్రిడ్‌మన్ విడుదల చేశారు.
తాను జీవన విధానం, జీవన విలువల గురించి ఆర్ఎస్ఎస్‌లో నేర్చుకున్నానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పరమార్థంతో కూడిన జీవితాన్ని పొందానని అన్నారు. ఆర్ఎస్ఎస్ సమావేశాలకు చిన్న పిల్లాడిలా హాజరవడం అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. దేశానికి ఏదో ఒక విధంగా ఉపయోగడపడాలని తనకు సంఘ్ నేర్పిందన్నారు ప్రధాని మోడీ.

సంఘ్(RSS) చాలా పెద్ద వ్యవస్థ. ఈ సంవత్సరంతో వందేళ్లు పూర్తి చేసుకోబోతోంది. ప్రపంచంలో ఆర్‌ఎస్‌ఎస్ కన్నా పెద్ద సేవా సంఘం మరొకటి లేదు. సంఘ్‌ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. సంఘ్ కార్యకలాపాలను అర్థం చేసుకోవాలంటే కొంత ప్రయాస పడాల్సిందే. జీవితం తాలుకు లక్ష్యాన్ని, ఉద్దేశ్యాన్ని సంఘ్ నేర్పిస్తుంది. దేశమే సర్వస్వం, జనాలకు సేవ చేయడమంటే, దేవుడికి సేవ చేయడమే అని నేర్పిస్తుంది అని ప్రధాని మోడీ వివరించారు.
#WATCH | "... On 27 February 2002, my government was to present the budget when we received the information about the Godhra train accident. It was a very serious incident. People were burnt alive. You can imagine what the situation must have looked like after all the previous… pic.twitter.com/1tF1EqSbwn
— ANI (@ANI) March 16, 2025
అంతేగాక, వేదాలు, స్వామి వివేకానందా చెప్పిన మాటలనే సంఘ్ సభ్యులు నేర్పిస్తుంటారు. సంఘ్‌లోని కొంత మంది సభ్యులు విద్యలో మార్పుల కోసం విద్యాభారతి అనే సంస్థను నెలకొల్పారు. దేశవ్యాప్తంగా వారు 25 వేల పాఠశాలలను నడుపుతున్నారు. 30 లక్షల మంది విద్యార్థులు వాటిల్లో చదువుతున్నారు. వామపక్షాలకు చెందిన కార్మిక సంఘాలు ప్రపంచంలోని కార్మికులందరూ ఏకం కండి అని నినాదమిస్తే కార్మికులారా ప్రపంచాన్ని ఏకం చేద్దాం అని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన కార్మిక సంఘాలు పిలుపునిస్తాయి అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
గోద్రా ఘటనపై ప్రధాని మోడీ స్పందన
2002లో గుజరాత్ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో తాను శాసనసభలో కూర్చొన్నానని.. అదే రోజు గోద్రా ఘటన జరిగిందని మోడీ గుర్తు చేసుకున్నారు. అది ఓ భయంకరమైన ఘటన అని అన్నారు. ప్రజలను సజీవ దహనం చేశారు. మీరు ఒక్కసారి ఆ పరిస్థితిని ఊహించండి. 2002కు ముందు గుజరాత్‌లో 250 పెద్ద పెద్ద అల్లర్లు జరిగాయి. 1969లో జరిగిన అల్లర్లు ఏకంగా 6 నెలలు వరకూ కొనసాగాయని తెలిపారు. అప్పుడు తమ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నారని చెప్పారు. వాళ్లు తప్పుడు ఆరోపణలతో తనపై కేసులు నమోదు చేశారన్నారు.
#WATCH | "... I feel fortunate that I learned the essence and values of life from such an esteemed organisation like the RSS. I got a life of purpose...," says PM Narendra Modi, in a podcast with Lex Fridman, as he talks about his association with the RSS.
— ANI (@ANI) March 16, 2025
He further says, "...… pic.twitter.com/cm1EOBf2fN
కానీ, న్యాయవ్యవస్థ అన్ని ఘటనలపై రెండు, మూడుసార్లు సమగ్ర విచారణ చేసింది. నిందితులను శిక్షించింది. న్యాయవ్యవస్థ తనపని తాను చేసింది. ఇది అందరికీ తెలుసు అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అంతేగాక, 2002 తర్వాత నుంచి కూడా గుజరాత్ రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉందని.. ఇప్పటి వరకు ఎలాంటి అల్లర్లు జరగలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.
-
పనిలో పని.. పాకిస్థాన్ నూ లేపేస్తే పోలా..!! -
నా ఆస్తులు చూసి నేనే షాకయ్యా: తనికెళ్ల భరణి సెటైర్లు! -
నన్ను బలిపశువును చేస్తున్నారు! -
T20 World Cup Final: సౌతాఫ్రికాతో పైనల్ వీళ్లకే- పాక్ మాజీ కెప్టెన్ జోస్యం..! -
జాక్‌పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
ఇరగదీశావ్ పో..: రామ్ చరణ్ డాన్స్ మూమెంట్స్ మెగాస్టార్ ఫిదా -
మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కొత్త పథకం అమల్లోకి..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
ఓటీటీలోకి కిర్రాక్ కామెడీ మూవీ.. పొట్టు పొట్టు నవ్వుకోండి..! -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్‌గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..?












Click it and Unblock the Notifications