వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఎఫెక్టా?: చర్చి కార్యక్రమంలో మోడీ, అన్ని మతాలు ఒక్కటేనని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఓ అడుగు వెనక్కి వేసినట్లుగా కనిపిస్తోంది! ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరావభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గతంలో కంటే కొంత భిన్నంగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్ నేత రాఘవ రెడ్డి కూడా రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. ఇబ్బందికర వ్యాఖ్యలతో ప్రధానిని ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు.

చర్చి కార్యక్రమంలో మోడీ

ప్రధాని మోడీ నాడు చర్చిల పైన దాడులను మరోసారి ఖండించారు. ఓ చర్చ్ కార్యక్రమంలో మోడీ మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడులను తీవ్రంగా ఖండించారు. అన్ని మతాలను తనలో కలుపుకొనే ఘన చరిత్ర భారత దేశానికి ఉందని చెప్పారు.

అన్ని మతాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే ప్రభుత్వం తమది అన్నారు. దేశంలో మతపరమైన హింస, విద్వేషాలకు తావులేదని చెప్పారు. తమ ప్రభుత్వం మెజార్టీ లేదా మైనార్టీకి అనుకూలం, వ్యతిరేకం కాదన్నారు. మతం అనేది ప్రజల వ్యక్తిగత అభిప్రాయంగా తాము విశ్వసిస్తామని చెప్పారు.

PM Modi: Govt will not allow any group to incite hatred

ప్రపంచం మతవ్యాప్తంగా విభేదాలు పెరుగుతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశం మాత్రం ప్రతి దానిని గౌరవిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వానికి అన్ని మతాలు ఒక్కటేనని చెప్పారు.

English summary
"We believe religion is personal choice of every citizen," Modi stressed, adding fanaticism will not be tolerated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X