ఏపీ విభజన సరిగా లేదు-అందుకే వైషమ్యాలు-రాజ్యసభలో మోడీ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ఇవాళ సమాధానం చెప్పిన ప్రధాని మోడీ కాంగ్రెస్ ను వరుసగా రెండోరోజు టార్గెట్ చేసుకున్నారు. రాష్ట్రాల విషయంలో, రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును తప్పుబట్టిన మోడీ.. ఏపీ విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాల్ని గుర్తుచేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు.
ఏపీ విభజనపై స్పందించిన ప్రధాని మోడీ... ఈ ప్రక్రియ తప్పుల తడక అని అన్నారు. రాజకీయ స్వార్ధం కోసమే ఏపీని హడావిడిగా విభజించారని మోడీ గుర్తుచేశారు. పార్లమెంటులో కరెంటు తీసేసారని, పెప్పర్ స్ప్రే ప్రయోగించారని, మైకులు కట్ చేశారని విభజన నాటి పరిస్ధితుల్ని మోడీ గుర్తుచేశారు. ఎలాంటి చర్చ జరగకుండానే విభజన బిల్లుకు ఆమోదం తెలిపారని విమర్శించారు. అయితే తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదన్నారు. అయితే విభజన జరిగిన తీరు సరిగ్గా లేదన్నారు. ఏపీ తెలంగా వైషమ్యాలకు కారణం కాంగ్రెస్సేనని మోడీ ఆరోపించారు. ఏపీ తెలంగాణలు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. తాము సాఫీగా మూడు రాష్ట్రాల్ని విభజించినట్లు మోడీ తెలిపారు.

Recommended Video
ఎయిర్ పోర్టుల్లో చిన్నచిన్న కారణాలతో ముఖ్యమంత్రుల్ని తొలగించిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందని మోడీ ఆరోపించారు.
ప్రధాని కుమారుడిని పట్టించుకోలేదని ఏపీ మాజీ సీఎం అంజయ్యను కాంగ్రెస్ తొలగించలేదా అని ప్రశ్నించారు. కర్నాటకలో వీరేంద్ర పాటిల్ ను కూడా ఇలాగే పదవి నుంచి తొలగించారని ప్రధాని ఆరోపించారు. తాము ఇలాంటి సంకుచిత మనస్తత్వంతో పనిచేయడం లేదని గుర్తుచేశారు. ఏపీలో ఎన్టీఆర్ సర్కార్ ను అస్ధిర పరిచింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications