అందరి దృష్టీ మోదీ పైనే- సర్వత్రా ఉత్కంఠత: మోదీ ఏం చెబుతారు?

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవ్వాళ కూడా సభలో వాడివేడిగా చర్చ సాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు దీనిపై మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ.. కేంద్రంపై చెలరేగారు.

ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై కిందటి నెల 26వ తేదీన ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం సభలో చర్చ ఆరంభమైంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్.. సహా ప్రతిపక్ష పార్టీల సభ్యులు దీనిపై మాట్లాడారు. ఎన్డీఏ పాలనలో దేశంలో సంభవిస్తోన్న పరిణామాలను ప్రస్తావించారు. మణిపూర్ అల్లర్లనూ సభ దృష్టికి తీసుకొచ్చారు.

PM Modi

ఇవ్వాళ- ఈ తీర్మానంపై కేంద్ర ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మాట్లాడారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలు చేశారు. సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్.. దేశాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ఎమర్జెన్సీ విధింపు.. ఓ చీకటి అధ్యాయంగా అభివర్ణించారు.

యూపీఏ సంకీర్ణ కూటమి పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. దీనికి సమాధానాన్ని కూడా ఆయనే ఇచ్చుకున్నారు. యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయల మేర కుంభకోణాలు జరిగాయని విమర్శించారు. బోఫోర్స్, 2జీ స్పెక్ట్రమ్, సీడబ్ల్యూజీ, బొగ్గు, ఆదర్శ్, నేషనల్ హెరాల్డ్, వాద్రా డీఎల్ఎఫ్, దాణా కుంభకోణాలన్నీ యూపీఏ హయాం నాటివేనని గుర్తు చేశారు.

PM Modi

వాటన్నింటినీ మర్చిపోయేలా చేసుకోవడానికి యూపీఏ పేరును మార్చారని ఎద్దేవా చేశారు అమిత్ షా. కూటమి పేరు మార్చడం తప్ప వారికి వేరే మార్గం లేదని అన్నారు. తాము ఎలాంటి మోసాలకు పాల్పడలేదని, అందుకే ఎన్డీఏ పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎన్డీఏ- దేశానికి సుస్థిర ప్రభుత్వాన్ని అందించ గలుగుతుందని చెప్పారు.

ఈ అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ గురువారం సమాధానం ఇవ్వనున్నారు. మోదీ రిప్లై తరువాత ఈ తీర్మానంపై సభలో ఓటింగ్ ఉంటుంది. బీజేపీ- ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉండటం వల్ల ఈ తీర్మానం వీగిపోవడానికి అధికావకాశాలు ఉన్నాయి. ఎన్డీఏకు 331, ఇండియాకు 144 మంది సభ్యుల బలం ఉంది. మరో 70 మంది తటస్థంగా వ్యవహరిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+