మాజీ సీఎంకు సీటు ఇవ్వకూడదని మోదీ, అమిత్ షా చెప్పారు. కేంద్ర మంత్రి షాక్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పలువురు పవర్ ఫుల్ లీడర్స్ జీవితాలు తారుమారు అయ్మాయి. ముఖ్యంగా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల ఎమ్మెల్యే టిక్కెట్లు గల్లంతు అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని వెలుగు చూసింది.

కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు జగదీష్ శెట్టర్ హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించడంతో అందరూ షాక్ అయ్యారు.

బీజేపీ హైకమాండ్ రాజీ ప్రయత్నాలు చేసినా ఎవ్వరి మాట వినని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి అదే రోజు బీఫామ్ తీసుకున్నారు. హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

modiamitjagadeesh1

మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కర్ణాటక మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కు ఈ సారి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకూడదని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు జగదీష్ శెట్టర్ కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. తరువాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా జగదీష్ శెట్టర్ కు ఫోన్ చేసి మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తామని, లేదంటే మీరు కోరుకున్న పదవి ఇస్తామని హామీ ఇచ్చారని ప్రహ్లాద్ జోషి మీడియాకు చెప్పారు.

modiamitjagadeesh1

ఈ సారి ఎమ్మెల్యే ఎన్నికల నుంచి తప్పుకోవాలని అమిత్ షా జగదీష్ శెట్టర్ కు సూచించారని, మీరు ఎవరికి చెబితే వాళ్లకే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని. అయితే జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారని, ఇది మేము అస్సలు ఊహించలేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వివరించారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కారణంగా తనకు టిక్కెట్ రాలేదని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. బీఎల్ సంతోష్ మీద కేవలం జగదీష్ శెట్టర్ మాత్రమే ఆరోపణలు చేశారని, మరెవ్వరు ఆరోపణలు చెయ్యలదేని ప్రహ్లాద్ జోషి అన్నారు. మాజీ సీఎం జగదీష్ శెట్టర్ చాలా పగటి కలలు కంటున్నారని, ఆ కలలు నెరవేరవని, కనీసం కలలు కని అయినా ఆయన సంతోషంగా ఉండాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యంగంగా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+