హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Wife: కవితలు రాసుకోకుండా దృశ్యం సినిమా టైపులో భార్యను ముక్కలుగా నరికేసిన కవి, స్టోరీ మొత్తం !

|
Google Oneindia TeluguNews

మీరట్: ప్రముఖ కవితో కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమలో పడిన యువతి ఆయనతో సంతోషంగా తిరిగింది. ఇద్దరు మనసులు ఒకటి కావడంతో ఇద్దరూ దగ్గర అయ్యారు కొంతకాలం తరువాత ఆ యువతి కవిని ప్రేమించి వివాహం చేసుకుంది. భార్యతో చక్కగా కాపురం చేస్తున్న కవి ఆయనపాటికి ఆయన కవితలు రాసుకుంటూ కాలం గడుపుతున్నాడు. మూడు వారాల క్రితం కవి భార్య కనపడకుండా పోయింది. నా భార్య కనపడటం లేదని ఆ కవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. చివరికి కనపడకుండా పోయిన కవి భార్య మృతదేహం ముక్కలు నది కాలువలో చిక్కడంతో అందరూ హడలిపోయారు. మహిళ హత్య కేసు విచారణ చేసిన పోలీసులు చివరికి అదే కవిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. కవితలు రాసుకోకుండా దృశ్యం సినిమా టైపులో భార్యను ముక్కలుగా నరికేసిన కవి స్టోరీ మొత్తం చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

Wife: కాపురం చెయ్యమంటే నా భర్త డబ్బులు అడుగుతున్నాడు, పడక సుఖం లేదని కేసు పెట్టిన భార్య !Wife: కాపురం చెయ్యమంటే నా భర్త డబ్బులు అడుగుతున్నాడు, పడక సుఖం లేదని కేసు పెట్టిన భార్య !

వ్యాపారవేత్త కూతురితో లవ్

వ్యాపారవేత్త కూతురితో లవ్

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుప్తా కు రూబి గుప్తా అనే కుమార్తె ఉంది. మీటర్ జిల్లాలోని సర్దనా పట్టణంలో ప్రముఖ కవి దీపక్ నిరాలా అనే కవి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ కవి దీపక్ నిరాలాతో కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమలో పడిన రూబీ గుప్తా ఆయనతో సంతోషంగా తిరిగింది. దీపక్ నిరాలా, వ్యాపారవేత్త కుమార్తె రూబీ గుప్తా వ్యవహారం వారి ఇళ్లలో తెలిసింది.

 లవ్ మ్యారేజ్ చేసుకున్న కవి

లవ్ మ్యారేజ్ చేసుకున్న కవి

కవి దీపక్ నిరాలా, రూబీ గుప్తాల మనసులు ఒకటి కావడంతో ఇద్దరూ దగ్గర అయ్యారు. నాలుగు సంవత్సరాల క్రితం దీపక్ నిరాలా, రూబీ గుప్తా ప్రేమ వివాహం చేసుకున్నారు. దీపక్, రూబీ గుప్తా దంపతులు సర్దనా పట్టణంలో కాపురం పెట్టారు. వివాహం జరిగిన తరువాత దీపక్, రూబీ గుప్తా దంపతులు చాలా సంతోషంగా ఉంటున్నారు.

 మూడు వారాల ముందు మాయం

మూడు వారాల ముందు మాయం

దీపక్ ఇటీవల సర్దనా పట్టణ పోలీసులను కలిసి మూడు వారాల నుంచి తన భార్య రూబీ గుప్తా కనపడటం లేదని కేసు పెట్టారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన రూబీ ఎక్కడికి వెళ్లిందో తెలీదని, ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని దీపక్ పోలీసులకు చెప్పాడు. ఇంటి నుంచి కనపడకుండా పోయింది వ్యాపారవేత్త కూతురు, ప్రముఖ కవి భార్య కావడంతో పోలీసులు ఆ కేసు మీద ఎక్కువగా ఆసక్తి చూపించారు.

 కవి మీద అనుమానం

కవి మీద అనుమానం

నా భార్య రూబీ గుప్తా కనపడటం లేదని కవి దీపక్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. చివరికి కనపడకుండా పోయిన కవి దీపక్ భార్య మృతదేహం కూడా చిక్కకపోవడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నది కాలువలో మహిళ శరీరంలోని కొన్ని ముక్కలు చిక్కడంతో స్థానికులు హడలిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 కవి ఇంట్లో ఇనుపరాడ్ స్వాధీనం

కవి ఇంట్లో ఇనుపరాడ్ స్వాధీనం

పోలీసులకు అనుమానం వచ్చి కవి దీపక్ ఇంటిలో సోదాలు చేశారు. ఇదే సమయంలో దీపక్ ఇంటిలో పెద్ద ఇనుపరాడ్ కనపడటంతో పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో కవి దీపక్ నిరాలా తన భార్య రూబీ గుప్తాను తానే హత్య చేశానని అంగీకరించాడని పోలీసు అధికారి బ్రిజేష్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు.

 టీ కోసం తిక్కతిక్క సమాధానాలు చెప్పిందని కోపం

టీ కోసం తిక్కతిక్క సమాధానాలు చెప్పిందని కోపం

పోలీసుల విచారణలో కవి దీపక్ షాకింగ్ విషయాలు బయటకు చెప్పాడు. ఆగస్టు 22వ తేదీన ఇంట్లో టీ పెట్టి ఇవ్వాలని నేను తన భార్య రూబీ గుప్తాకు చెప్పానని దీపక్ అంటున్నాడు. ఆ సమయంలో నేను టీ పెట్టివ్వను, నీకు ఇష్టం ఉంటే నువ్వు టీ పెట్టుకో అంటూ రూబీ గుప్తా తిక్కతిక్కగా సమాధానం చెప్పిందని, ఆ సమయంలో తాను కోపంతో క్రిష్టల్ గ్లాస్ తీసుకుని ఆమె మీద దాడి చేశానని దీపక్ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

 ఇనుప రాడ్ తో దాడి చేసి

ఇనుప రాడ్ తో దాడి చేసి

క్రిష్టల్ గ్లాస్ తగిలి రూబీ గుప్తా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని, ఆ సమయంలో తాను ఎక్కువ ఆందోళన చెందానని దీపక్ అంటున్నాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న తన భార్య రూబీ గుప్తా మీద ఇనుపరాడ్ తో దాడి చేసి చంపేశానని, ఆమె ప్రాణం పోయింది అని నిర్దారించుకున్న తరువాత శవం మాయం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశానని దీపక్ చెప్పాడని పోలీసు అధికారి బిజ్రేష్ కుమార్ ఆయనను కలిసిన మీడియాకు చెప్పాడు.

 భార్యతో రూ. 20 లక్షల విషయంలో తేడా

భార్యతో రూ. 20 లక్షల విషయంలో తేడా

తన భార్య రూబీ శవాన్ని ముక్కల ముక్కలుగా నరికేసి వాటిని గోనె సంచిలో మూట కట్టి తరువాత నది కాలువలో అక్కడక్కడా విసిరేశానని దీపక్ అంగీకరించాడని పోలీసు అధికారి బిజ్రేష్ కుమార్ ఆయనను కలిసిన మీడియాకు చెప్పాడు. కొంతకాలంగా కవి దీపక్, ఆయన భార్య రూబీ కొన్ని విషయాల్లో గొడవలు జరుగుతున్నాయని, ఇద్దరి మద్య రూ. 20 లక్షల విషయంలో మనస్పర్థలు మొదలైనాయని, అందుకే ఆమె హత్యకు గురైయ్యిందని పోలీసు అధికారి బిజ్రేష్ కుమార్ చెప్పారు.

Recommended Video

సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు Uttej Wife కన్నుమూత..!! || Oneindia Telugu
 భార్య శవం ముక్కలు ముక్కలు చేసి కాలువలో విసిరేసిన కవి

భార్య శవం ముక్కలు ముక్కలు చేసి కాలువలో విసిరేసిన కవి

ఇనుప రాడ్, రూబీ గుప్తాను శవం కత్తిరించిన ఆయుధం స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి బిజ్రేష్ కుమార్ అన్నారు. నది కాలువలో రూబీ గుప్తా శవం ముక్కలు చిక్కాయని, మిగిలిన శవం కోసం గాలిస్తున్నామని మీరట్ జిల్లా పోలీసు అధికారి బిజ్రేష్ కుమార్ చెప్పారు. మొత్తం మీద కవి దీపక్ ఆయన భార్య, ప్రముఖ వ్యాపారవేత్త కూతురు రూబీ గుప్తాను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

English summary
Wife: Poet chops wife’s body into pieces in Meerut: Turns to Drishyam movie to hide crime in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X