కారు, బైకుల నిండా మద్యం బాటిళ్లే: 7500 లీటర్ల లిక్కర్ ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు
శివమొగ్గ: ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ధన ప్రవాహం ముంచెత్తుతోంది. భారీగా నగదును, వెండి, బంగారు వస్తువలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. తాజాగా మద్యాన్ని సీజ్ చేశారు. ఈ మద్యం విలువ 35 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ, పోలీసులు అంచనా వేస్తున్నారు. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మద్యాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లుగా ప్రాథమికంగా అంచనా వేశారు.

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో దేశవ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు ఉమ్మడిగా నాలుగు రోజులుగా అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో- కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లువెలుగు చూశాయి. 7,526 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శివమొగ్గ జిల్లా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బసవరాజ్ తెలిపారు. ఈ మద్యం విలువ 35, 21, 491 రూపాయలుగా ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు.

మద్యం బాటిళ్లతో పాటు రెండు బైకులను స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసులో ఏడుమందిని అరెస్టు చేశామని అన్నారు. వారిని జ్యూడీషియల్ కస్టడీకి పంపించినట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణలకు తరలిస్తున్నట్లు తాము అనుమానిస్తున్నామని, మరిన్ని వివరాలను సేకరించాల్సి ఉందని అన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications