Dream 11: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‍లో రూ.1.5 కోట్లు గెలిచిన ఎస్సై.. సస్పెండ్ చేసిన అధికారులు..
ప్రముఖ ఆన్‌లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ Dream11లో ఓ ఎస్సై రూ.1.5 కోట్ల విలువైన మొత్తాన్ని గెలుచుకున్నాడు. పోలీసు అయి ఉండి ఆన్ లైన్ బెట్టింగ్ ఆడినందకు అతనిపై పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పూణేకు చెందిన సోమనాథ్ జెండే పింప్రి చించ్‌వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ గా పని చేస్తున్నారు. అతను అక్టోబరు 10న విధుల్లో ఉన్నాడు.
అదే సమయంలో ఇంగ్లాండ్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌పై బెట్టింగ్ వేశాడు. ఇంగ్లాండ్ - బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడిన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసుకున్నారు. దీంతో సోమనాథ్ ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు మిఠాయిలు పంచుకొని సంబరాలు కూడా చేసుకున్నారు. సోమనాథ్ మూడు నెలలుగా సోమనాథ్ డ్రీమ్ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

తనకు వచ్చిన డబ్బుతో తన ఇంటి రుణాన్ని చెల్లించాలని భావిస్తున్నాడట. మిగిలిన భాగాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్‌లలో పెట్టుబడి పెడతారని.. దాని వడ్డీతో అతని పిల్లల చదువు కోసం కేటాయిస్తారని తెలిసింది. సోమనాథ్ డ్రిమ్ 11 లో రూ.1.5 కోట్లు వచ్చిన వార్తల వైరల్ కావడంతో మహారాష్ట్ర పోలీస్ శాఖ అతనిపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అతడిపే సస్పెన్షన్ వేటు వేసింది.
నిబంధనలను అతిక్రమించి పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఆయనను విధుల నుంచి సస్పెండు చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్ మానే ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డిసీపీ విచారణ చేస్తారని చెప్పారు. Dream11 ఆన్ లైన్ బెట్టింగ్ యాప్. ఇది ఫాంటసీ క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, రగ్బీ, ఫుట్‌సల్, అమెరికన్ ఫుట్‌బాల్, బేస్‌బాల్‌లలో
బెట్టింగ్ వేయడానికి అవకాశం కల్పిస్తుంది.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ తీవ్ర నష్టాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెట్టింగ్ లకు అలవాటు పడి చాలా మంది ఆర్థికంగా నష్టపోయినట్లు చెబుతున్నారు. బెట్టింగ్ లు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications