150 హెలికాప్టర్లు, ఏ పార్టీకి ఎన్ని ?, గంటలకు ఎన్ని రూ. లక్షలు అంటే ?, మస్త్ మజాతో !

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడంతో నాయకులు పలు నియోజక వర్గాల్లో పోటాపోటీగా ప్రచారం చెయ్యడానికి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు నువ్వానేనా అంటూ ఎగపడి పోటీ పడుతున్నారు.

కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, సిట్టింగ్ సీఎంతో పాటు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ స్థాయి నాయకులు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి కర్ణాటకకు వెలుతున్నారు.

leaders who book 150 helicopters in Karnataka

తక్కువ సమయంలో ఎక్కువ నియోజక వర్గాల్లో జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చెయ్యడానికి ఎక్కువగా హెలికాప్టర్లలో సంచరించాలని పలు పార్టీల నాయకులు డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువ ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు హెలికాప్టర్లలో సంచరించాలని నాయకులు నిర్ణయించారు.

కర్ణాటకలో దాదాపు 100 హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. చాలా రోజుల క్రితమే హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడానికి పలు పార్టీల నాయకులు వాటిని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి మరో 50 హెలికాప్టర్లను పలు పార్టీల నాయకులు అద్దెకు తీసుకున్నారు. మొత్తం 150 హెలికాప్టర్లను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవడానికి బుక్ చేసుకున్నారు.

leaders who book 150 helicopters in Karnataka

కర్ణాటకలో హెలికాప్టర్లకు, మిని విమానాలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. హెలికాప్టర్ల యజమానులు, హెలికాప్టర్లు అద్దెకు ఇస్తున్న సంస్థలు వాటి అద్దెలు 15 శాతం పెంచాశాయి. రెండు సీట్లు ఉన్న హెలికాప్టర్లు గంటలకు రూ. 2. 10 లక్షలు, నాలుగు సీట్లు ఉన్న హెలికాప్టర్లు గంటలకు రూ. 2. 30 లక్షలు అద్దె వసూలు చేస్తున్నాయి.

ఆరు సీట్లు ఉన్న హెలికాప్టర్లు గంటకు గంటకు రూ. 2. 60 లక్షలు, మిని విమానాలకు గంటలకు రూ. 3 50 లక్షల అద్దె వసూలు చేస్తున్నారు. 13 సీట్లు ఉన్న మిని విమానాలు జీఎస్ టీతో సహ రూ. 4 లక్షలు వసూ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఒక్కోరోజు ఎక్కువ నియోజక వర్గాల్లో పర్యటించడానికి ఇప్పటికే హెలికాప్టర్లు బుక్ చేసుకున్నారు.

బెంగళూలోని జక్కూరు, హెచ్ఏఎల్, యలహంక, వైట్ ఫీల్డ్ ప్రాంతంలో హెలిప్యాడ్ లో, అధికారులు సూచించిన ప్రాంతాల్లో పార్కింగ్ చెయ్యడానికి అవకాశం కల్పించారు. బెళగావి, బీదర్, బళ్లారి, కలబురి ప్రాంతాల్లో హెలికాప్టర్ల పార్కింగ్ కోసం సంబంధిత అధికారులు అవకాశం కల్పించారు. మొత్తం మీద నెల రోజుల పాటు కర్ణాటకలో హెలికాప్టర్లు, మిని విమనాల జోరు ఓ రైంజ్ లో ఉంటుందని వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+