విజయ్ మార్క్ రాజకీయం, DMK- AIADMK విలవిల: కదులుతున్న పునాదులు..!!
తమిళనాడులో ప్రమాణ స్వీకారానికి ముందే విజయ్ ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తున్నారు. అధికారం చేపట్టేందుకు కొద్ది సీట్ల దూరంలో విజయ్ పార్టీ నిలిచిపోయింది. దాదాపు పది మంది ఇతర ఎమ్మెల్యే మద్దతు అవసరం అయింది. దీంతో.. డీఎంకే- ఎన్డీఏ కూటముల పైన విజయ్ గురి పెట్టారు. రెండు కూటముల్లోని పార్టీలు విజయ్ వైపు మళ్లేందుకు నిర్ణయించాయి. డీఎంకే, అన్నా డీఎంకే నుంచి కొందరు ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తున్నారు. విజయ్ ఏ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేదీ నిర్ణయానికి వచ్చారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
విజయ్ దెబ్బకు డీఎంకే- అన్నా డీఎంకే కు భారీ షాక్ లు తగులుతున్నాయి. డీఎంకేలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్ విజయ్ తో చేతులు కలిపేందుకు సిద్దమైంది. దీని పైన డీఎంకే నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. వెన్నుపోటు రాజకీయాలంటూ విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీలు కూటమిని వదిలి విజయ్ తో కలిసేందుకు సిద్ధమయ్యాయి. ఈ రోజు సాయంత్రం గవర్నర్ తో విజయ్ సమావేశం కానున్నారు. తాను ఏ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందీ వివరించనున్నారు.

రేపు (గురువారం) మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించాలని టీవీకే నేతలు కోరగా.. మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య తదితర వివరాలు అడిగానని.. వాటి కోసం ఎదురుచూస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఆ వివరాలు సమర్పించాకే విజయ్‌తో భేటీ అవుతానని స్పష్టం చేశారు. టీవీకే తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలు, ఆ పార్టీకి మద్దతిచ్చే పార్టీల సభ్యుల వివరాలను తెలిపిన మీదటే తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
మద్దతు పార్టీలతో కలిసి గవర్నర్ వద్దకు విజయ్
ఆయన వ్యాఖ్యలపై టీవీకే స్పందించింది. గవర్నర్ అడిగిన వివరాలన్నీ అందించామని, అధిక సంఖ్యాబలమున్న పార్టీ తమదేనంటూ గణాంకాలతో పంపామని స్పష్టం చేసింది. 234 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 118 స్థానాలు అవసరం కాగా.. విజయ్ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచింది. దీంతో కాంగ్రెస్, పీఎంకే, వామపక్షాల మద్దతు కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
డీఎంకే కూటమిలోని కాంగ్రెస్(5), సీపీఎం(2), సీపీఐ(2), వీసీకే(2)లతో పాటు అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే(4)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు విజయ్ సిద్దం అయ్యారు. డీఎంకే - అన్నా డీఎంకే నుంచి కొందరు ఎమ్మెల్యేలు టచ్ లోకి వస్తున్నారు. అయితే, వారిని చేర్చుకోవటం పైన విజయ్ ఇప్పటికైతే సుముఖంగా లేరు. విజయ్ కు మద్దతు విషయంలో అన్నా డీఎంకే లో చీలిక కనిపిస్తోంది. డీఎంకే కాంగ్రెస్ నిర్ణయంతో విభేదిస్తోంది. దీంతో... విజయ్ ప్రమాణ స్వీకారం వేళ తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications