పవర్ స్టార్ దెబ్బకు పగిలిపోవాలి, పక్క రాష్ట్రంలో పవన్ కల్యాణ్ క్రేజ్, డేట్ ఫిక్స్ చేసిన బీజేపీ!
దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫీవర్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండటంతో అక్కడి నాయకులు చాలా బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిమిషం తీరికలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి ఫుల్ బిజీ షెడ్యూల్ లో కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం అయ్యింది. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఈ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు బీజేపీ, జేడీఎస్ పార్టీలు సవాల్ విసిరాయి.

కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు అనేక వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. కర్ణాటకలో తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటక బీజేపీ నాయకులు మాస్టర్ ప్లాన్ వేశారు. టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్‌ను కర్ణాటక రాష్ట్రానికి బీజేపీ ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 17వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 28 నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు పలు వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏప్రిల్ 17న రాష్ట్రానికి వస్తున్నారని, బీజేపీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలు అయిన రాయచూర్, బళ్లారి, చిక్కబళ్లాపూర్, బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గాల్లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అలాగే ఈ నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులు రాజా అమరేశ్వర నాయక్, బళ్లారి శ్రీరాములు, డాక్టర్ సుధాకర్ రెడ్డి, బెంగళూరులో తేజస్వి సూర్యకు మద్దతుగా ఓటు వెయ్యాలని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాయచూరుకు ఆంధ్ర ప్రదేశ్ కు చాలా అవినాబావ సంబంధం ఉంది. అలాగే తెలుగు మాట్లాడే వారు రాయచూర్ లో అధిక సంఖ్యలో ఉన్నారు. దానికితోడు ఆంధ్రా సినీ తారల ప్రభావం కూడా రాయచూర్ పై ఉంది.
ఇలా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాయచూరులో బీజేపీ అభ్యర్థి రాజా అమరేశ్వర్ నాయక్ తరుపున ప్రచారం చేసి తెలుగు మాట్లాడేవారిని ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు. తెలుగు ప్రభావం ఎక్కువగా ఉండే బళ్లారిలో తెలుగు ఐక్యతను నిలబెట్టిన ప్రాంతంగా బళ్లారి గుర్తింపు తెచ్చుకుంది. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి శ్రీరాములు కోసం ఎన్నికల ప్రచారం చెయ్యడానికి అక్కడి తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించనున్నారు.

శ్రీరాములు స్నేహితుడు, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకుడు గాలి జానార్దన్ రెడ్డి కొద్దిరోజుల క్రితమే బీజేపీలో చేరారు. అయితే బళ్లారిలో అడుగుపెట్టకుండా గాలి జనార్ధన్ రెడ్డికి కోర్టు ఆంక్షలు విధించడంతో పవన్ కల్యాణ్ ప్రచారం బళ్లారి శ్రీరాములుకు మరింత మేలు చేస్తుందనేది బీజేపీ నేతల లెక్కలు వేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చిక్కబళ్లాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కర్ణాటక మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ చిక్కబళ్లాపురంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ ను ఈ లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపురంలో గెలిపించాలని తెలుగు మాట్లాడే నియోజక వర్గాల్లో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తూ రోడ్ షో నిర్వహించనున్నారు.
చిక్కబళ్లాపురం లోక్ సభ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, తెలుగు ఓటర్ల ఓట్లు బీజేపీ వైపు మొగ్గు చూపితే అది బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ గెలుపునకు దోహదపడుతుందని బీజేపీ లెక్కలు వేసింది. ఇక బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తరపున పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. బెంగళూరులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది












Click it and Unblock the Notifications