ధర్డ్ ఫ్రంట్ కు గెలిచే సీన్ లేదు-రెండో ఫ్రంట్ తోనే బీజేపీ ఓటమి-పీకే కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకత పెరుగుతున్న వేళ దానికి ప్రత్యామ్నాయంగా మరో బలమైన కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ధర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నాలపైనా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దీంతో ఇప్పుడు పీకే వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.

దేశంలో ఏ మూడో ఫ్రంట్ అయినా నాలుగో ఫ్రంట్ అయినా ఎన్నికల్లో విజయం సాధించగలదన్న నమ్మకం తనకు లేదని, బీజేపీని ఓడించాలంటే ఆ పార్టీ రెండో ఫ్రంట్‌గా అవతరించాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ టిఎంసి మూడవ ఫ్రంట్‌గా ఆవిర్భవించడానికి మీరు సహాయం చేస్తున్నారా అని ఓ ఛానల్ అడిగిన ప్రశ్నకు ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

prashant kishor confident on second front, says no third front can will polls in india

దేశంలో మూడో ఫ్రంట్ లేదా నాలుగో ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధించగలదని నేను ఎప్పుడూ నమ్మలేదని, బీజేపీని మొదటి ఫ్రంట్‌గా పరిగణిస్తే.. ఆ పార్టీని ఓడించాలంటే రెండో ఫ్రంట్ కావాల్సిందేనని, ఏ పార్టీ అయినా బీజేపీని ఓడించాలనుకుంటే.. రెండవ ఫ్రంట్‌గా ఆవిర్భవించాలంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను సెకండ్‌ ఫ్రంట్‌గా భావిస్తున్నారా అని ఆయన్ను ప్రశ్నించగా.. దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌ అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు పీకే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓ దశలో ఆయన్ను నేరుగా పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించినా, ఇద్దరికీ షరతులు కుదరకపోవడంతో పీకే వెనక్కి తగ్గారు. అయినా ఆయన కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే సెకండ్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ధర్డ్ ఫ్రంట్ కంటే బలమైన సెకండ్ ఫ్రంట్ ఉండటమే మేలని ఆయన సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+