నితీశ్ వర్సెస్ పీకే: మోడీకి దండం పెడుతున్న ఫోటో షేర్..
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ వర్సెస్ బీహర్ సీఎం మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. పీకే బీజేపీతో ఉండాలని అనుకుంటున్నారని నితీశ్ అగ్నికి ఆజ్యం పోశారు. దీనికి ప్రశాంత్ కూడా అదేవిధంగా స్పందించారు. మోడీకి దండం పెట్టే.. నమస్కారం చేసే ఫోటోలను కూడా షేర్ చేశారు. రెండు ఫోటోలను ట్వీట్ చేసి.. విమర్శలు చేశారు.
బీజేపీతో ఇదివరకు జేడీయూ కలిసి ఉంది. ఆ సమయంలో తీసినవే ఈ ఫోటోలు.. వాటిని పీకే పోస్ట్ చేశారు. గత నెలలో నితీశ్ బీజేపీకి షాక్ ఇచ్చి.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి విపక్షాల ఐక్యతను చాటాలని ట్రై చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో విపక్షాలు గెలిచేందుకు వ్యుహా రచన చేస్తున్నాయి.

పీకే రహస్యంగా బీజేపీ కోసం పని చేస్తున్నారని నితీశ్ ఆరోపించడంతో అగ్గిరాజేసింది. నెల క్రితం అధికారం పక్షంతో ఉన్న నితీశ్ కుమార్, ఇప్పుడు విపక్షంతో ఉన్నారని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. ఇతరులపై ఆధారపడకుండా ఉండలేరని చెప్పారు. బిహార్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం జాతీయ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదన్నారు.
పీకే.. నితీశ్‌తోను కలిసి పనిచేశారు. ఆ పార్టీలో కూడా చేరారు. కానీ రెండు కత్తులో ఒక ఒరలో ఇమడలేవన్నట్టు.. పార్టీని వీడారు. అప్పటినుంచి వీరి మధ్య దూరం పెరిగింది. తెలంగాణలో కేసీఆర్‌తో పీకే పనిచేస్తున్నారు. ఏపీలో జగన్‌తో కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో పీకే వ్యుహలు పనిచేసి.. వైసీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications