కేంద్ర మంత్రికి కౌంటర్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ ... ఏమన్నారంటే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విషయంలో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలకు ప్రశాంత్ కిశోర్ కౌంటర్ ఇచ్చారు . పీకే ఎవరో తనకు తెలీదని వ్యాఖ్యలు చేసిన మంత్రికి తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది. కేజ్రీవాల్ సారధ్యంలో ఆప్ గెలుపు కోసం పీకే పని చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కో ఇన్‌ఛార్జ్‌గా హర్‌దీప్ సింగ్ పూరి వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన పీకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు .
కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరికి 'ఆమ్ ఆద్మీ పార్టీ' ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిశోర్ ఎవరో తనకు తెలియదని..హర్‌దీప్ సింగ్ పూరి మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ ఎవరు? నాకు అతనెవరో తెలియదు. ఆయనను నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పిన ఆయన ఈ పార్టీ లోనుండి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుండి మరో పార్టీలోకి మారే వాళ్ళ గురించి నాకు తెలీదు అన్నారు. ఆయనెవరో మీకు తెలియదా? 2014 ఎన్నికల్లో మీ గెలుపు కోసం పనిచేశారుగా, గుర్తుకు తెచ్చుకోండి అన్నప్పటికీ అప్పట్లో తాను బీజేపీలో లేనని, కాబట్టి ఆ విషయం తనకు తెలియదని తేల్చి చెప్పారు.

ఈ నేపథ్యంలో పీకే కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించారు . ఆయనో సీనియర్ మంత్రి. నాలాంటి సామాన్యుడి గురించి ఆయనకు తెలియాలని ఏముంది? నాలాగే యూపీ, బీహార్‌ల నుంచి లక్షలాది మంది ఢిల్లీకి వచ్చి బతుకుపోరు సాగిస్తున్నారు. వారి గురించి పూరి లాంటి సీనియర్ నేతకు ఎలా తెలుస్తుంది అంటూ పీకే మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అంటే సామన్యుల గురించి మంత్రి హర్‌దీప్ సింగ్ పూరికి తెలియదని చెప్పి ఆయన బీజేపీ నేతల నైజం సంపన్నులనే గుర్తిస్తారన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు.












Click it and Unblock the Notifications