Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అయోధ్య చరిత్రలో మరో అద్భుత ఘట్టం, ఏంటి ‘శ్రీరామ యంత్రం’?

అయోధ్య రామమందిర చరిత్రలో అక్షరబద్ధం చేయదగ్గ మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనతో అయోధ్య ధామ్ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. కేవలం ఒక పర్యటనగానే కాకుండా, భారతీయ వేద విజ్ఞానానికి, ఆధునిక పునరుజ్జీవనానికి వారధిగా నిలిచిన ఈ సందర్భం కోట్లాది మంది భక్తులకు చిరస్మరణీయంగా నిలిచిపోనుంది.

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి, భక్తిప్రపత్తులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం ప్రస్తుతం సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సాధిస్తున్న పునరుజ్జీవనానికి ఈ రామమందిరమే సజీవ సాక్ష్యమని ఆమె కొనియాడారు. మూడు రోజుల ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా అయోధ్య చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో అత్యంత ప్రధానంగా, ఆలయ రెండో అంతస్తులో వేద మంత్రోచ్ఛారణల మధ్య 150 కిలోల బరువున్న, బంగారు పూత పూసిన అత్యంత పవిత్రమైన 'శ్రీరామ యంత్రం' ఫలకాన్ని రాష్ట్రపతి స్వయంగా ప్రతిష్ఠించారు.

President Murmu in Ayodhya Installation of 150kg Golden Shri Ram Yantra Marks a New Spiritual Era at Ram Mandir

ఆధ్యాత్మిక శక్తి కేంద్రం ఈ 'శ్రీరామ యంత్రం'..

ఈ శ్రీరామ యంత్రం కేవలం ఒక లోహపు పలక మాత్రమే కాదని, ఇది సానుకూల ఆధ్యాత్మిక శక్తిని వెదజల్లే దైవిక యంత్రమని ఆలయ ట్రస్టు సభ్యులు వెల్లడించారు. వేద గణితం (Vedic Mathematics), క్లిష్టమైన రేఖాగణిత నమూనాల ఆధారంగా రూపొందించిన ఈ యంత్రం, ఆలయ ప్రాంగణంలో దైవిక ప్రకంపనలను ప్రసరింపజేస్తుందని విశ్వసిస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో, కంచి పీఠంలోని పురాతన యంత్రాన్ని నమూనాగా తీసుకుని దీనిని సిద్ధం చేశారు. దీనిపై పవిత్రమైన 'బీజ మంత్రాలు' అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. సుమారు రెండేళ్ల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఊరేగింపుగా అయోధ్యకు తీసుకువచ్చిన ఈ యంత్రాన్ని, గురువారం 'అభిజిత్ ముహూర్తం'లో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించడం విశేషం.

అయోధ్య రాముడి సేవలో చంద్రబాబు..! యోగీ సర్కార్ పై ప్రశంసలు..!
అయోధ్య రాముడి సేవలో చంద్రబాబు..! యోగీ సర్కార్ పై ప్రశంసలు..!

విశ్వ శిఖరాలకు భారత్ ..

సందర్భోచితంగా జరిగిన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ, శ్రీరాముడి ఆశయాలు భారతీయులందరినీ ఏకం చేస్తాయని, ఈ క్షేత్రం నుండే దేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టేందుకు ప్రతిజ్ఞ పూనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రసంగిస్తూ.. నేటి భారతం కేవలం 'కొత్త భారతం' మాత్రమే కాదని, ప్రపంచానికే మార్గదర్శనం చేస్తున్న 'మారుతున్న భారతం' అని అభివర్ణించారు. గత ఏడాది కాలంలో సుమారు 158 కోట్ల మంది భక్తులు ఉత్తరప్రదేశ్ లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించారని, యువతలో ఆధ్యాత్మికత పట్ల పెరుగుతున్న ఆసక్తి దేశ భవిష్యత్తుకు శుభసంకేతమని ఆయన పేర్కొన్నారు.

శ్రీరామ నవమి.. ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ
శ్రీరామ నవమి.. ఐదు శతాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. భావోద్వేగానికి గురైన ప్రధాని మోదీ

కార్మికులకు గౌరవం - కట్టుదిట్టమైన భద్రత..

రాష్ట్రపతి తన పర్యటనలో భాగంగా కేవలం దైవ దర్శనానికే పరిమితం కాకుండా, రామమందిర నిర్మాణంలో చెమటోడ్చిన కార్మికులను ప్రత్యేకంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు మాత అమృతానందమయి, పలువురు సాధుసంతులు పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా అయోధ్య నగరంలో సుమారు 7,000 మంది పోలీసులతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. చైత్ర నవరాత్రుల పవిత్ర కాలంలో జరిగిన ఈ ప్రతిష్ఠాపన మహోత్సవం అయోధ్య ఆధ్యాత్మిక వైభవాన్ని మరోస్థాయికి తీసుకెళ్లింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+