మోదీకి 73 ఏళ్లు, ఆయనకు రాజకీయాల్లో రిటైర్ మెంట్ ఉందా ?, లేదా?, మాజీ సీఎం !
బెంగళూరు/హుబ్బళి/న్యూఢిల్లీ: వయసు అయిపోయింది. మీరు ముసలోళ్లు అయిపోయారు అంటూ చాలా మందిని బీజేపీ పార్టీ నుంచి ఇంటికి పంపిస్తున్నారని, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరిస్తోందని, ఇదే సిద్దాంతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కూడా వర్థిస్తుందా ?, లేదా ? అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పుడు 73 ఏళ్లు అయ్యిందని, బీజేపీ సిద్దాంతాలు మోదీకి వర్థిస్తాయా అంటూ హుబ్బళి-ధారవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. రెండుసార్లు ప్రధాన మంత్రి పదవి చేపట్టిన నరేంద్ర మోదీ మరోసారి ప్రధాన మంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అన్నారు.

తాను బీజేపీలో ఉంటూ పార్టీ ఇచ్చిన అన్ని పదవులు అనుభవించి చివరికి పార్టీకి ద్రోహం చేశానని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారని, తన పనితీరును చూసి బీజేపీ పెద్దలు పిలిచి తనకు పదవులు ఇచ్చారని జగదీష్ శెట్టర్ అన్నారు. అయితే ముఖ్యంగా కేంద్ర మంత్రి ప్లహ్లాద్ జోషి తన మీద ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారని జగదీష్ శెట్టర్ మండిపడ్డారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సార్లు గుజరాత్ కు ముఖ్యమంత్రి అయ్యారు, రెండు సార్లు ప్రధాన మంత్రి అయ్యారు, మరోసారి కూడా ఆయన ప్రధాన మంత్రి కావాలని ఆశపడుతున్నారని, ఆయన మరోసారి ప్రధాని అయితే తాను సంతోషిస్తానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నుంచి ఇటీవల బయటకు కాంగ్రెస్ పార్టీలో చేరిన జగదీష్ శెట్టర్ అన్నారు.
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರಿಗೆ 73 ವರ್ಷ, ರಾಜಕಾರಣ ಬಿಡುತ್ತಾರೆಯೇ?
— oneindiakannada (@OneindiaKannada) May 12, 2023
-ಜಗದೀಶ ಶೆಟ್ಟರ್#jagadishshettar #karnatakaelections2023 #narendramodi #congress #BJP pic.twitter.com/IuUqlTCcYS
నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన ప్రహ్లాద్ జోషి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఆ పదవి అనుభవిస్తున్నారని, ప్రహ్లాద్ జోషికి కూడా రాజకీయాల్లో రిటైడ్ మెంట్ ఉంటుందా ?, లేదా ? అని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ప్రశ్నించారు. హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని సర్వేలు కూడా చెప్పాయని జగదీష్ శెట్టర్ అన్నారు.
తాను కచ్చితంగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తాను ఎలాంటి పదవులు ఆశించనని, ఎమ్మెల్యేగా సంతోషంగా ఉంటానని మాజీ సీఎం జగదీష్ శెట్టర్ అన్నారు. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ అంగీకరించకపోవడంతో జగదీష్ శెట్టర్ బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.












Click it and Unblock the Notifications