సిద్దూ, డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ, మొన్న మాటల యుద్దం !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిడా డీకే శివకుమార్ శనివారం మద్యాహ్నం బెంగళూరులోని కంఠీర స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖలు హాజరై సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను అభినందించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ తదితరులు బెంగళూరు చేరుకుని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డీకే శివకుమార్ కు శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు బెంగళూరులో జరిగిన కార్యక్రమానికి హాజరై సిద్దరామయ్య, డీకే శివకుమార్ ను అభినందించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో మూడు రోడ్ షోలు, కర్ణాటకలోని పలు జిల్లాల్లో ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. అయితే బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు సొంతం చేసుకుని కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్- బీజేపీల మధ్య పోటాపోటీగా ఎన్నికల యుద్దం జరిగింది.
కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్ కు అంతా శుభం జరగాలని, మీకు ఇవే నా శుభాకాంక్షలు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్ చేశారు. కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు సైతం సిద్దరామయ్య, డీకే శివకుమార్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారని తెలిసింది.
ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తో పాటు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల బీజేపీ నాయకులు బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు. అయితే 66 సీట్లకే పరిమితం అయిన బీజేపీ కర్ణాటకతో కాంగ్రెస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications