జయ బెయిల్ సస్పెన్స్: తమిళుల ఇక్కట్లు (పిక్చర్స్)
బెంగళూరు/చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్ పైన మంగళవారం కర్నాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
జయలలితకు బెయిల్ ఇవ్వాలని, ఆమె కోర్టుకు అందుబాటులోనే ఉంటారని న్యాయస్థానానికి ఆమె తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అనంతరం జయ బెయిల్ పిటిషన్ పైన విచారణ మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా పడింది.
ఇదిలా ఉండగా.. జయలలితకు మద్దతుగా తమిళనాడు, కర్నాటకల్లో పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఇది తమిళనాడు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరోవైపు, జయలలితకు బెయిల్ రాకుంటే కన్నడిగులను బందీలు చేస్తామంటూ బెంగళూరులో హెచ్చరిక పోస్టర్లు వెలిశాయి.

జయలలిత - ఆందోళనలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైలులో ఉన్న అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత భవితవ్యం మంగళవారం తేలనుంది.

జయలలిత - ఆందోళనలు
జయకు మద్దతుగా తమిళనాడు అంతటా అన్నాడిఎంకె శ్రేణులు మాత్రం ఆందోళన కొనసాగిస్తునే ఉన్నారు. అధినేత్రిని విడుదల చేయాలంటూ జయ అభిమానులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్టవ్య్రాప్తంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు.

జయలలిత - ఆందోళనలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు గత నెల 27న ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ జయ కర్నాటక హైకోర్టులో పిటిషన్ వేశారు.

జయలలిత - ఆందోళనలు
ఆమె బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. జయకు బెయిల్ వచ్చి తీరుతుందన్న విశ్వాసం అన్నాడీఎంకే శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.

జయలలిత - ఆందోళనలు
ఇలా ఉండగా మంగళవారం నుంచి మినీ బస్సుల బంద్ చేయనున్నట్టు తమిళనాడు ఓనీ బస్సు యజమానుల సంఘం ప్రకటించింది.

జయలలిత - ఆందోళనలు
అన్నాడిఎంకె అధినేత్రిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బస్సులు నిలిపివేసి నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు ఓనీ బస్సు యజమానుల సంఘం కోశాధికారి డి మారన్ వెల్లడించారు.

జయలలిత - ఆందోళనలు
ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకూ బస్సులు తిరగవన్నారు. 32 జిల్లా కేంద్రాల్లో దీక్షలు చేస్తామన్నారు. ఇలా ఉండగా నీలగిరి, కోయంబత్తూర్ జిల్లాల బంద్‌కు పిలుపునివ్వడంతో సోమవారం పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

జయలలిత - ఆందోళనలు
ప్రముఖ పర్యాటక కేంద్రాలైన ఉదగ మండలం, కన్నూర్, గుడ్లూరు, కొతగిరి జిల్లాల్లో ఒకరోజు పాటు బంద్ పాటించారు. బస్సులు లేకపోవడంతో చాలామంది ఇబ్బంది పడ్డారు.

జయలలిత - ఆందోళనలు
మరోవైపు, జయలలిత బెయిల్ పిటిషన్ పైన విచారణ నేపథ్యంలో కర్నాటక హైకోర్టు వద్ద పోలీసులు మంగళవారం 144వ సెక్షన్ విధించారు.

జయలలిత - ఆందోళనలు
బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతున్న హైకోర్టు వద్ద, జయలలిత ఉన్న పరప్పన అగ్రహార జైలు వద్ద, పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

జయలలిత - ఆందోళనలు
జయలలితను విడుదుల చేయాలని డిమాండ్ చేస్తూ అన్నాడీఎంకే శ్రేణులు తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున మంగళవారం నిరసనలు చేపడుతున్నారు.

జయలలిత - ఆందోళనలు
తమిళనాడు-బెంగళూరు ప్రధాన రహదారిపై చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. హైకోర్టు ప్రాంగణంలోకి కూడా ఇతరులకు ప్రవేశం లేకుండా చర్యలు తీసుకోనున్నారు.

జయలలిత - ఆందోళనలు
తమిళనాడు-బెంగళూరు ప్రధాన రహదారిపై చెక్‌పోస్టును ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. హైకోర్టు ప్రాంగణంలోకి కూడా ఇతరులకు ప్రవేశం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు హైకోర్టు ప్రాంగణాన్ని సోమవారం పరిశీలించారు.

జయలలిత - ఆందోళనలు
జయలలితకు మద్దతుగా తమిళనాడు, కర్నాటకల్లో పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. ఇది తమిళనాడు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications