హీరోయిన్‌పై అత్యాచారం: ఆ రోజు జరిగింది ఇదీ..

మలయాళీ హీరోయిన్‌పై లైంగిక దాడి కేసుకు సంబంధించి తనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత ఆంటో జోసెఫ్ మీడియా ముందుకు వచ్చారు.

కొచ్చి: మలయాళీ నటిపై అత్యాచారం కేసు తన మెడకు చుట్టుకోవడంతో నిర్మాత జోసెఫ్ ఆంటోనీ వివరణ ఇచ్చారు. గత శుక్రవారంనాడు నటిని అపహరించి, ఆమెపై లైంగిక వేధింపులకు గురి చేసిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని ఆయన వివరించారు. ఘటన జరిగిన తర్వాత మొదట దర్శకుడు లాల్ తనకు ఫోన్ చేశారని ఆయన చెప్పారు.

తన ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉండడంతో తాను ఎత్తలేకపోయానని, ఆ తర్వాత రెంజీ పనిక్కర్ తనకు ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి చెప్పారని, సాధ్యమైనంత త్వరగా లాల్ ఇంటికి రమ్మన్నారని, దాంతో తాను ఎమ్మెల్యే పిటి థామస్‌తో కలిసి లాల్ ఇంటికి చేరుకున్నానని ఆయన చెప్పారు.

Producer Anto Joseph clarifies allegations

పోలీసులు, మార్టిన్ అప్పటికే అక్కడ ఉన్నారని, పిటి థామస్ మార్టిన్‌ను ప్రశ్నించారని, అతని దగ్గరి నుంచి తాను సునీ నెంబర్ తీసుకున్నానని ఆయన చెప్పారు. తన నెంబర్ నుంచి మార్టిన్ సునీకి ఫోన్ చేశాడని, మొదట అతను ఫోన్ ఎత్తలేదని, కానీ ఆ తర్వాత కాల్ బ్యాక్ చేసి నువ్వు ఎవరని అడిగాడని జోసెఫ్ చెప్పారు.

అంతే తప్ప తనకు సునీతో ఏ విధమైన సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను పోలీసులకు కూడా చెప్పినట్లు తెలిపారు. అది దారుణమైన ఘటన అని, ఇలాంటి ఘటన ఏ అమ్మాయికి కూడా జరగకూడదని ఆయన అన్నారు.

కారులో దుండగులు తనపై లైంగిక దాడికి పాల్పడిన తర్వాత నటి దర్శకుడు లాల్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాతనే తాను పల్సర్ సునీకి ఫోన్ చేసినట్లు జోసెఫ్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+